విషక్రిమి న్యాయము

ఈపుర మందున యెవరోయి పెద్దలు?
తాళద్రుమమెకాదె చాల పెద్ద
పండిత సత్తముల్ పురవీధులందున
ఎరుగంగ చెప్పుము యెవరు వారు?
పరసతులధనపు హరణమందునను
సర్వులు పండిత సత్తముల్నగరాన
దాతయెవరరోయి నగరాన తెలియగా
రజకుండెదాతయౌ రమ్య గుణుడు
ఉతకితెచ్ఛునుకాదె వుడుపులెల్ల
ఎట్లు బ్ర తుకుచుంటివెరుగంగ చెప్పుము
గరళాన క్రిమివోలె గడుపుచుంటి
ఆ.వె.ఇట్టి యూరనుండి యిక్కట్ల పాలౌట
సర్వ సహజమాయె జనుల కెల్ల
మంచితనము చూడ మచ్చుకైననులేదు
ఎట్లుగడప గలమొయింక మీద
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత