చదువులమ్మ

చదువులమ్మయనుచు శారదామాతకు
మ్రొక్కులిడుదు నేను మోదమంద
"హంబీజ రూపాన హంసవాహనమెక్కి
విజ్ఞాన బీజాలు విత్తు తల్లి
విద్యార్థులెల్లరు వినుతి చేసెదరమ్మ
జ్ఞానబిక్షకొరకు కాంక్షతోడ
అజ్ఞాన తిమిరాన నల్లాడు జనులెల్ల
వినతి జేసెదరమ్మ విద్య కొరకు
సాహితీ విభవమ్ము సంగీత మర్మంబు
వేదాంత తత్త్వంబు వేద్యమంద
అరుగుదెంచితీవు ననురాగమొప్పగా
బాసరంబు నీకు వాసమాయె
కరుణతోడ నీవు కాపాడ వలెనమ్మ
విద్యనొసగు తల్లి వినయమిమ్ము
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత