వాయుగుండం
వాయుగుండమొకటి వాయించి వాయించి
జాడించి జాడించి చల్ల బడగ
వీధియె చెరువాయి యిల్లంత చెరువాయె
ఆబాలగోపాలమంతయునారట
పడిరయ్యొయాకటబాధతోడ
దినఫల మంతయు తీరుతారు లయ్యెగా
వారఫలపువారి వార్త లేదు
భాగ్యనగరమంత పంకజాకరమాయె
ఎల్లమ్మ గుడిలోన యేరుసాగె
కండ్లలో నీళ్ళాయె కడకు మనకు
నగరాన నావచ్చె నగుబాట్లుపాలెయె
నరకమే మేలన్న నగర జనులు
కారులె యోడలై కంటిముందుకదల
ఓడలె బండ్లౌట యోప్పెనిట్లు
దారేదొ తెన్నెదో తడబాటుతప్పదాయె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి