వాల్మీకి కోకిల

వాల్మీకి కోకిల వనశాఖిపైనెక్కి
రామ రామ యనుచు రాగ.మెత్తె
మధురాక్షరంబైన మాధుర్య గీతమ్ము
అఖిలలోకంబంత నాలకించ
వాల్మీకి వనసింహు వరరామ నాదమ్ము 
పరమపదమునిచ్చు భయము తీర్చు
రామకథాసుధ రసరమ్యరీతితో 
కలకాలముండును ఖిలముగాక
అయ్య లెల్లరురామయ్య లైరి జగతి
తల్లు లందరు సీతమ్మ తల్లులైరి
తమ్ము లందరు రామయ్య తమ్ములైరి
రాజ్యమంతయు రామయ్య రాజ్య మాయె
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత