దుర్యోధనుడు

దుష్టబుధ్ధియగుట దుర్యోధననునకు
సహజలక్షణమాయె చాటి చెప్ప
దైవహేళనచేయు దారణంపుతెలివి
వంశనాశనమనక వదరెనిటుల
తనవారినందర తనతోటి చావగా
మానధనునిపేరు మట్టిగలిసె
ఇట్టివాడేరీతి యితిహాస పురుషుంఢు 
ఆదర్శమూర్తిగా యవతరించె
ఆ.వే.మాటమాటి కిట్లు మదపుపిచ్చియటుల
పొగడ దగునె వీని ప్రొద్దు.పోక
పాప కార్యమిదియె ప్రారబ్ద కర్మంబు
మానరయ్య మీరు మనసులోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత