గణితము
ఆటలో గణితమ్ము పాటలో గణితమ్ము
తిండిలో గణితమ్ము తీరు యిదియె
నింగిలో గణితమ్ము నీటీలో గణితమ్ము
నీలోన గణితమ్ము నీడవోలె
మాటలో గణితమ్ము మందులో గణితమ్ము
వరదలో గణితమ్ము వర్ణితమ్ము
ఆశలోగణితమ్ము నార్తిలో గణితమ్ము
వాస్తులో గణితమ్ము వాస్థవమ్ము
వ్యాపార గణితమ్ము వ్యవహారగణితమ్ము
గణితమ్మె బ్రతుకాయె గడియ గడియ
ఆవె.బ్రతుకులెక్కలెల్ల బహుబాగు నేర్పించి
విలువ కట్టు నేర్పు విశద పరచి
భావి పౌరు జేయు బాధ్యతల్ యెనగూర్చు
లెక్క సరిగా జేయు రేడుయతడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి