తృష్ణ

తృప్తిలేకనరుడు తృష్ణతో తపియించి
తన్నుకొనుచు చచ్చు తనకు తానె
కూడబెట్టుచుతాను కూలిపోవునుకాని
లెక్కలాపనయట్టితిక్కలాడు
లంకెబిందెలనుచు లటుకులాడుచుతాను
పాతకొంపలెనుక పరుగు పెట్టు
అంజనమ్మనుచునునరచేత చూపుచు
మాయదారివెనుక మాటవేయు
ఆ.వే.ఉన్న దానితోడ నుత్కృష్ట మౌరీతి
గడప గలిగి చాలు గరిమ తోడ
లేనిదాని కొరకు లేకిపనులులెల్ల 
మానవలయు నీవు మనసుపెట్టి
(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత