కనకదుర్గ

కనకమయతనొప్పె కనకదుర్గాదేవి
ఇంద్రకీలాద్రి పై యింపుగూర్చ
చిరునవ్వు చిందించు శ్రీమాత తేజస్సు
పొగడంగతరమౌనె పూర్తిగా ను
దుర్గము దునుమాడి దుర్గయౌ విలసిల్లె
శాకంబరీదేవి శాంత మూర్తి
గాయత్రి దేవిగా కాపాడుభ క్తాళి
అన్నపూర్ణాదేవియౌ యాకలితీర్చును
సంగీత సాహిత్య సారస్వతంబంత
భారతీదేవియై భాగ్యమొసగు
ఆ.వె.భక్త జనుల కెపుడు భధ్రమ్ము నివ్వగా
విజయ వాడయందు వెలసెదుర్గ
అమ్మయయ్య లిట్లు నాప్యాయ మందించ
జన్మ ధన్యమగును జడత లేక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత