మారాజు

మకుటమ్ము లేనట్టి మారాజు నీవయ్య
గాంభీర్య మెప్పగా గద్ధె చిక్కె
ఏరాజు కున్నది యీపాటి విభవమ్ము
రాజ్యాలు లేనట్టి రాజ్య మాయె
నరులబ్రతుకులందు నాణ్యమేదనియంచు
చింతింతు వేలనొ చిత్త మందు
వానరలలో నున్న రాలి పోవనేమి రంజిల్లు వనమంత
క్షణము కాలమున్న చాలు బ్రతుకు
రాగమందు కొన్న రంజిల్లనూ వచ్చు
బాగలేక పోవ బడలి కొచ్చు భావమ్ము
నరులలో లేదంచు నలగబోకు
ఆ.వె.రామ రాజ్య మింక రావలయుననచు
నీదు తలపు యింక నిజమె యగును
కోత లెపుడు చాల కోయునరులకన్న
కోతి మేలుకాదె కోటి రెట్లు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
రాలి పోవనేమి రంజిల్లు వనమంత
క్షణము కాలమున్న చాలు బ్రతుకు
రాగమందు కొన్న రంజిల్లనూ వచ్చు
బాగలేక పోవ బడలి కొచ్చు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత