లలితాంబ
సమరంబు చేయగా సమకట్టె లలితాంబ
అసురమూకలనెల్ల యణచ దలచి
చిదగ్ని కుండాన చిన్మూర్తి గావచ్చి
అమరవరుల నెల్లయాదు కొనియె
భావనా గమ్యవై భవబంధ ముల్ ద్రుంచి
భవరోగ వైద్యంబు మాకు చేయ
కైలాసగిరినుంచి కదలివచ్చితివివమ్మ
కరుణార్ద్ర దృష్టితో కదిలివచ్చినతల్లి
భక్తప్రియయనుచు భక్తివశ్యవనుచు
బహుపురాణోక్తులు మాకుతెల్పె
ఆ.వే.నిన్ను నమ్మి నాము నిరతంబు నీధ్యాసె
ఇదియె చాలు మాకు యిహము నందు
పరము చూడ నీదు బాధ్యతే యగునమ్మ
తనవి చెందవలదె తల్లి వద్ద
(రచన:౼విద్వాన్ అఖిలజ గతికెల్లయాధార మైనావు
భూమత యైనావు భూతతతకి
జలరూపమైనావు జాలితో మామీద
దాహంబు తీర్చావు తల్లి యట్లు
వైష్ణవీ మాయతో వైరిసంఘమునంత
పరిమార్చి నావమ్మ. భద్రమొసగ
విద్యాస్వరూపివై వేదాది శాస్త్రాలు
వేద్యంబు యౌనట్లు విద్య నొసగి
ఆ.వే సకలజనుల కెల్ల సర్వశుభములిచ్చి
భుక్తి తోడ మాకు ముక్తి నివ్వ
కంకణంబు కట్టి కాపాడు తల్లివి
మాతృ రూపి యైన మమత వీవు
(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
మహర్నవమి సందర్భంభంగ.అమ్మకు నమస్కృతులతో) నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి