గురువు

శిల్పి చాతుర్యంబు శిల్పంబు లోనుండు
కవులకౌశలమంత కావ్యమందు
శాస్త్రవేత్తల కృషి సాధనాంతరముల
హాలికునికృషి ధాన్యపురాసులయందు
చిత్రకారునికృషి చిత్రంబునందున
కనిపించు మనకంత కనుల ముందు
హంగునార్భాటముల్ నసలేమి లేకుండ
తరగతి గదిలోనే తపమువోలె
భావిభరతమంత భవ్యమౌరీతిగా
నియమనిష్టలతోడనిలుపునతడు
అంతరిక్షమునుంచి యాటబొమ్మవరకు
అతడులేకుండగాయవని లేదు
ఆ.వె.చదువు సంధ్యలందు సంస్కారమందున
గురువు తీర్చు దిద్దు గొప్పగాను
అతనికేమికాన్క యర్పింపగలమయ్య
దండమిడుట కన్న దారిగలదె
(రచన:--విద్వాన్ ఆదిశంకరుడంతయవనికేతేంచగా
అద్వైత తత్త్వంబు నందినాము
తర్కంపు మార్గాన తనవాద మంతయు
వేదోక్త మార్గాన వెల్ల డించె
అద్వైత మార్గాననమృతత్త్వమంతయు
లభియించు ననితాను నభిల  షించె
షణ్మతములనెల్ల స్థాపించి ధరపైన 
పంచాయతన పూజ భాగ్యమొసగె
భక్తి భావన మంత ప్రజలకందునట్లు
శ్లోకరచనచేసి శుభము గూర్చె
ఆ.వే.అపర శంక రుండవనికేతెంచ
దుష్ట మతములెల్ల ధూళి కలసె
మేరు నగము వోలె మేదిని కంతకు
తత్త్వ శాస్త్ర మొసగు తపసి యితడు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశిస్త్రి) నాగరాజశాస్త్ర

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత