ప్రకృతి రక్షణ

పకృతిరక్షణమది ప్రథమకార్యమగును
వనము వలనెకాదె వసుధ బ్రతుకు
తరువురక్షకిదియె తగినసమయమింక
తరువురక్షవలనె ధరణి బ్రతుకు
అడవిజంతువులెల్ల నాగమై పోకుండ
భద్రపరుపవలయు బ్రదుకు కొరకు
సహజవనురులెల్ల సాంతమై పోకుండ
భద్రపరుచుమింక భవిత కొరకు
ఆ.వే.నరులు మేర మీర నాశంబు సత్యంబు
అదుపు చేయ వలయు నాశనింక
రేపు యెకటి కలదు రెచ్చిపోకుడుమీరు
మాట చెప్పినాను మరువ కండి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత