కలెక్టర్-పొట్ల పెరుగు పచ్చడి

తారిఖులతో వచ్చిన తకరారు
----
ఇది చాలా కాలం క్రిందట జరిగిన ముచ్చట.ఇంగ్లీష్ వారు మనదేశాన్ని పాలిస్తున్న రోజులట.
ప్రతి గ్రామంలో శిస్థువసువులుగురించి రా బడులగురించి  గ్రామకరణాలు మునసబులు చూసుకోనెవారు.ఆదాయవ్యయాలగురించి తెలుసుకొనేందుకు డిప్యూటికలక్టరో, కలెక్టర్ ఎవరు వచ్చి విచారించే వారు.దీనికి జమాబంది అనేపేరు.ఆ కాలంలో సాధారణంగా కరణాలు ఆరువేలనియోగులో ప్రథమశాఖలో వుండేవారు.
ఒకసారి ఆంగ్లేయకలెక్టర్ జమాబంది నిమిత్తం గ్రామానికి క్యాంపుకొచ్చాడు.
అతనికి తిండి తిప్పలు చూచే బాధ్యత కరణం వంతైనది.
ఆ రోజు కరణంగారి తండ్రి తద్దినం భోక్తల భోజనాలైన తరువాత కలెక్టర్ గారికి భోజనం ఏర్పాట్లలో ఈ తద్దినంపిండి వంటలు చేరాయి. ముఖ్యంగా ఆరోజు ఆవ పెట్టిన పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా వుంది. మన కలెక్టర్ గారి పిండి వంటలు కన్నా ఈ ఆవ పెరుగు పచ్చడి కి ఫిదా అయిపోయాడు. ఈ రోజు ఏమిటీ స్పెషల్ అంటే మానాన్నగారి తిథి అని చెప్పాడు కారణం.కలెక్టర్ గారు తనడైరిలో ఆ తారిఖున టిటిTiti(తిథికి వచ్చిన తిప్పలు)  అని రాశుకొన్నాడు.మరుసటి సంవత్సరం  పొట్లకాయ పెరుగు పచ్చడి భ్రాంతి తో  తయారయ్యాడు.
యథా ప్రకారంగా భోజనాలు పంపిస్తే తద్దినం వంట బదులు మాములు భోజనం వుంది. పైగా పొట్లకాయ పెరుగు పచ్చడీ మిస్సింగు.పాపం కలెక్టర్ గారికి కోపం తన్నుకు వచ్చి వేర్ యిజ్ టీటి (where is titi) అని రంకేలు.కరణం గారికి అయోమయంమైంది.అర్థం కాలేదు.కొంత సేపటికి గత సంవత్సరం కలెక్టర్ గారు వచ్చిన విషయం గుర్తుకు వచ్చి.తద్దినాలు తిథుల ప్రకారం వస్తాయి గాని తారిఖుల లో రాదని వివరించి వివరించి శోష వచ్చి, మళ్ళి ఆ తద్దినం వంటలే పొట్లకాయ పెరుగు పచ్చడితో సహా  వండి పంపిస్తే, కలెక్టర్ గారి ముఖం సంతోషం వికసించింది."యస్! దిసీజ్ టీటీ "అంటూ లొట్ట వేసుకు తిన్నాడట.
మొత్తానీకి అది కలెక్టర్ గారి తద్దినం మైంది.
(,ఇదే కరణంగారి అనుభవం నాకు జరిగింది.రేపు మాయింట్లో ఆబ్దికముంది ,సెలువు కావాలని అడిగితే.నోనో ఆదివారం పెట్టుకోవచ్చు కదా! అని ఉవాచ! మహాప్రభో ! తద్దినాలకు తారిఖులు ముఖ్యాంశాలు కాదూ, తిథులు ముఖ్యమని సవినయంగా తెలపాలసి వచ్చింది)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత