శయన కాళి (చంద్రపూర్, మహారాష్ట్ర)

అలసి సొలసె తల్లి నసురమూకలతోడి
అనవరతముపోరినాదమరిచె
విశ్వశాంతికొరకు వీరత్వమొప్పగా
ఎంతపోరెసల్పె యెవరికెఱుక
విజయమందె తల్లి విజయదుర్గయగుచు
దుష్టశిక్షచేసి దుర్గయాయె
కలిమి లిచ్చు తల్లి కనకదుర్గయగుచు
భక్తజనుల బ్రోచె భవుని పత్ని
ఆ.వె.ఆగ్రహమ్ముతోడ యసురుల నిర్జించ
కన్న తల్లివోలె కరుణ జూపి
విశ్వజనని వీవు విసుగుచూపవెపుడు
కన్నతల్లి యిట్లు కావు మమ్ము
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత