పరమేశ్వర పరిణయోత్సవము
పరమేశ్వర పరిణోయోత్సవము సంభ్రమము-----------------------------నీవు జగన్నాటక సూత్రధారివి. అప్పడప్పుడప్పుడు పాత్రధారి నీకూ డా!
నీ వివాహ వైభవసమయంలో నీవు రచించిన నాటకంలో పాత్రధారిత్వంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణకూడావహించి ఆనాటకాన్ని రక్తి కట్టించావు.
సామాన్యంగా తమ కుమార్తె సుఖంగా హాయిగా ఉండాలంటే ధనవంతునకు భార్యగా వుంటే బాగుంటుందని భావిస్తుంది అత్తగారు.
"కన్యావరయతే రూపం
మాతా విత్తం పితాశృతం" అనే లోకోక్తిని వినే వుంటారు
కన్యవరుని రూపాన్ని యిష్టం పెడితే,అత్తగారు అల్లుడిగారి యైశ్వర్యాన్ని యిష్టపడుతుంది.మామగారేమో అల్లుడికీ పేరుప్రఖ్యాతులను యిష్టం పడుతాడు.
ఇది లోక సహజము.
నీ అత్తగారైన మేనాదేవి కూడా,సప్త ఋషులు చెప్పిన మాటలివి తన అల్లుడు ధనవంతుడని మురిసీపోయింది.కానీ నీవు అత్తగారికి చుక్కలు చూపించావు.
"నః స్వామీ జగతాం బాగా ధనపతేః సేవ్యః సురాణామతి
శుత్వాతుభ్యముమాం ప్రతిశుతివితీ మేనా మునీనాం పురం
త్వామీశావసనం పిశాచ సుహృదం ప్రేతావృతం ప్రాంగణే
దృష్టా చిత్రం శిఖిండిభిః ప్రహసితం మేనానటైః నాటకం"
హిమవంతుని వద్దకు నీపనుపున పెండ్లి ముచ్చట్లు మాట్లాడటానికి నీవు సప్త ఋషులను పంపించావు.వారు ఈ దంపతులతో మాస్వామి త్రిలోకాధినాదుడు,ధనపతి కుబేరుడు మిత్రుడు,దేవతలచే సేవలందుకోనేవాడు అనిగొప్పలు చెప్పారు. వారి మాటలను పరిపూర్ణంగా నమ్మిన తనకుమార్తెను ఇచ్చుటకు సిద్ధపడింది.కానీ ఆవివాహసమయంలో దిగంబరునిగా,పిశాచములతో పరివేష్టుడయి,భూతములకు స్నేహితునిగా దర్శించి,ఇదంతా సప్త ఋషులచే ఆడబడిన వినోదాత్మక నాటకంగా భావించింది.
నీ వివాహ సమయంలో నీ ప్రేమతో గుణములు తక్కువ తినలేదు. వారుహిమవంతుని పరివారాన్ని తమ ఆజ్ఞలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.వివాహసమయంలో ఆడపెళ్ళివారిపై వియ్యాలవారు పెత్తనం చేయడం లోక సామిన్యమేకదా!
శూలాని క్షుహి లోహకార డమరూన్ మాతంగి సహ్యా తచ్వా
వ్యాళాన్ జాంగలికా:ప్రయచ్చ-శబర వ్యాఘ్రిజినా న్యానయా
ఖట్వంగాన్యపి సూత్రధారి!ఘటయే-త్యుద్వాహకోలాహలే
డండ్యంతే హిమవత్ఫురే భావాలను జ్ఞాతై ర్గణైః కారవః"
పెండ్లి కొడుకై హిమవంతుని పురమునకు వెళ్ళావు నీవు. నీపరివారమైన ప్రమథగణాలు నీ అనుమతితో హిమవంతుని పరివారాన్ని ఇలా తొందర పెట్టె స్తున్నారట!
"ఓ కమ్మరీ! ఈ శూలము మోనలను సన్నగా చేసి పదును పెట్టాలి సుమా!చర్మకారుడా! ఈ డమరుకాలను తోలుతో గట్టిగా బిగించాలి.ఓపాములవాడా! పాములను తెచ్చిపెట్టాలోయి!పులితోళ్ళు అత్యవసరం త్వరగా తెచ్చిపెట్టాలి "అని ఆజ్ఞాపిస్తున్నారట.
పరమేశ్వరునిఅలవాట్లను అభిరుచులను బిల్హణమహాకవి ఇలా చమత్కారంగా వర్ణిస్తున్నాడు.
శివునికిష్టమైన అలవాట్లలో మొదట భస్మాంగ రాగత్వము,మరొకటి తాండవకేళిఇందులో భస్మమును దేహమంతా అలముకోవడం మరీయిష్టము.
"శ్వశ్రూ స్సవ్వీడ మేషా-మిషతి నవిహితః--కంకణస్యాపి మోక్షం
కోసా వుధ్ధాళనస్యా-వసర-ఇతి భవా-న్మాతృభిర్వారితో2పి
నిర్వృత్తో మాధుపర్కో -విధిరితి గిరిజా-సిధ్ధి సిధ్ధాంత వాదీ
నిర్వాణస్థ స్వప్రాణి--గ్రహణజహుతభు-గ్భస్మలిప్తో ననర్త"
ఓం పరమేశ్వరా! నీవుఎదో ఒకవిధంగా పార్వతిని పెండ్లి యాడితివి.పార్వతీమాతను నీదానిగాచేసుకొంటివి.ఇంతమాత్రము చాలునను పట్టుదలతో నున్నావు.పాణిగ్రహణ సమయమున ప్రజ్వలింపచేసిన అగ్ని కొంత చల్లారగానే అందులో లభించే భస్భాన్ని మైపూతగా పూసుకోవడానికి సిద్ధపడ్డావు నీవు.అంతటితో ఆగావా నీవు! ఊహు! నృత్యము చేయటానికి పూనుకొన్నావు.అది చూచి నీ వెంట నున్న బ్రాహ్మీ,మహేశ్వరీ మొదులగు సప్తమాతృకలు నీవుఇప్పుడు చేసే పని ఏ మాత్రము బాగుండలేదని ఆపడానికి ప్రయత్నించారు. నీవు చేయబోతున్న ఈపనిని పార్వతీ దేవి కాదనలేక అలా అని అంగీకరించనూ లేక సీగ్గుపడుతున్నదని సప్తమాతృకలు ఒకటే గోల!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి