అసుతోషుని అపూర్వకరుణ
ఆంగ్ల సేనాని నిర్మించిన శివాలయం
++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷
బ్రిటీష్ వారు భారతీయ ఉపఖండంలో తమపరిపాలనా సౌలభ్యం కోసం ఇంద్రభవనాలవంటి అధికార నివాసాలను,మతప్రచారానికై చర్చీలను క్యాథడ్రెల్ల్స్ కట్టించారు.అబ్బె! ఇది మామూలు విషయమే.ఇందులో వింతేముంది అనుకోవచ్చు.
ఆంగ్ల సేనాని అర్ధాంగి కోరిక మేరకు పరమేశ్వారాలయాన్ని పునర్మించాడు.పునర్నించడమేమిటి కొత్తదే కట్టి నట్లైనది.
అతని భార్య అలాంటి కోరిక కోరడమేమిటి? ఆ ఆంగ్ల సేనాని ఆ కోరిక తీర్చడమే మిటి అనే సందేహం రావచ్చు? ఇది సహజం కూడా!
ఇంతకూ ఆశివాలయం ఎక్కడుంది? ఆ కథేమిమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి సహజాతి సహజం.
ఈ శివాలయం మధ్యప్రదేష్ లోని అగర్ మాల్యా అనే ప్రదేశంలో వుంది.ఈ శివాలయం పురాణం ప్రసిధ్ధమైనది.ఇక్డవెలసిన పరమేశ్వరుని పేరు వైద్యనాథ్ మహాదేవుని గా భక్తులందరికి బాగా తెలుసు.
ఇక అసలు విషయానికొద్దాము.అవి బ్రీటీషువారు భారత ఉపఖండాన్ని పరిపాలిస్తున్న రోజులు.1879వ సం||లో ఆంగ్లేయులకు ఆఫ్ఘనులకు భీకర యుద్ధాలు జరుగుతున్నాయి.ఆ యుధ్ధంలో బ్రీటీషుసైనిక పటాలానికి లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ నాయకత్వం వహిస్తున్నాడు.
ఆఫ్ఘన్ రణక్షేత్రంనుంచి తన భార్యకు క్షేమం సమాచారాలు ఎప్పటికప్పుడు పంపుతుండేవాడు.క్రమంగా యుద్ధం భయంకరంగా మారింది.అందువల్ల క్షేమసమాచారాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చి చివరకు ఆగిపోయాయి.
భర్తే తన సర్వస్వం అని భావించే ఆ ఇల్లాలికి ఈ పరిణామం మిక్కిలి మనొ వేదనను కలిగించింది.ఆమెమనసు అల్లకల్లోలమైంది.రాత్రింబవళ్ళు భర్తక్షేమసమాచారాల చింతే.భోజనం సహించటం లేదు.నిద్రరావడం లేదు.క్షణమొక యుగంలా గడుస్తుంది."అతి ప్రేమా పాపశంకి" అన్నట్లు భర్త యోగక్షమేలా గురించి వెర్రిమొర్రి ఆలోచనలు ఈగల్లా ముసిరుతున్నాయి.దీనీతో ఉన్న మనశ్శాంతి కాస్తా ఆవిరైనది.
తానున్నదా పరదేశం.తన బాధను పెంచుకోవడానికి తల్లిదండ్రులుకానీ,ఆత్మీయులు కానీ ఎవరూ లేరు.ఇలా ఆమె జీవితం వేదనా భరితమైనది.తనవేదననుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఆమె ప్రతిరోజు సాయంకాలము గుర్రంపై వాస్తవానికి వెళ్ళెది.తన దారిలోనే వైద్యనాథ్మహాదేవుని మందిరం వుంది.సాయం సమయాల్లో ఆ ఆలయం నుంచి,శంఖన
నాదాలు డమురుకధ్వనులు నమకచమకములు వేదఘోషా ,ఇవన్ని ఆమె మనసుకు స్వాంతన కలిగించ సాగాయి.క్రమక్రమంగా ఆమె అడుగులు మందిరంవైపుకు దారితీసాయి.భవరోగవైద్యుడైన ఆ వైద్య నాథుని కరుణ ఆమెకు అనుభూతం కాసాగింది.
ఇలా పూజామందిరంలో ప్రవేశించిన ఆంగ్లవనిత రాక అర్చకులకు,భక్తులకు ఆశ్చర్యం కలిగించింది.
వేదనా భరితమైన ఆమెముఖమును చూచిన అర్చకులు ఆమె ఎదో దిగులుతో వుందని అర్థమైనది. వారు దయార్ద్రహృదయులై ఆమెవేదనకు కారణం అడిగి తెలుసుకొన్నారు.అదృష్టవశాత్తు ఆంగ్లం బాగా తెలిసిన భక్తుడు భాషా విషయంలో వారికి సహకారమందించాడు. ఇన్నాళ్ళూ తనమనస్సులో గూడుకట్టుకుని వున్న దుఃఖం కట్టలు తెంచుకొంది.కొంత సేపటికి తెప్పరిల్లి తనభర్త క్షేమసమాచారాలకై తాను పడుతున్న వేదనను గురించి తెలిపి,తన భర్త క్షేమంగా రావడానికి మార్గాన్ని ఉపదేశించమని అర్థించింది.
అర్చకులు "అమ్మా! పరమేశ్వరుడు దయాళువు,కరుణాసింధుడు,అతని కరుణ అపారము ,అతని దయాదృష్టివుంటే కొండల్లాంటి ఆపదలైనా దూదిపింజల్లా ఎగిరి పోతాయి.కాబట్టి నీవు శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో శివపంచాక్షరీ మంత్రాన్ని జపించ వలసిది"గా చెప్పారు.వారు ఆమెకు శివపంచాక్షరీ దీక్షను ప్రసాదించారు."అమ్మా!నీభర్త క్షేమం సమాచారాలు తొందరలోనే అందుకోబోతా"వని అభయమిచ్చారు.
శివపంచాక్షరీ మంత్రస్వీకారంతో ఆమెకు కొత్త బలంవచ్చినట్లైంది.ఇఃటికి రావడమే తరవాయిగా శివపంచాక్షరీ జపాన్ని నియమనిష్టలతో అఖండంగా జపించసాగింది.తనభర్త సకుశంలంగా తిరిగి వచ్చిన వెంటనే ,దేవాలయాన్ని పునరుద్ధరణ చేయిస్తానని సంకల్పించుకొంది.ఇలా 11 రోజులు గడవగానే ఆమెకు భర్తనుంచి ముఖ్య సందేశమొచ్చింది.ఇన్నాళ్ళుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన మహత్తర సందేశం ఇలా వుంది
"నేను యీసందేశాన్ని యుధ్ధ భూమి నుంచి పంపిస్తున్నాను.ఇంతకు ముందు నేను పంపిన సందేశాలు చేరి వుంటాయని భావిస్తున్నాను.నేటి యుధ్ధాన కౄరులు,బలవంతులైన పఠానులు మామీద ఒక్కసారిగా మూకమ్ముడిగా విరుచుకు పడ్డారు.మాకు ఇక మరణం తప్ప మరో మార్గంలేదని పించింది.అలాంటి విపత్కర పరిస్థితిలో చుక్క తెగి
పడిన రీతిలో జటాజూటధారి త్రిశూలాన్ని ధరించి పఠానులపై విరుచుకు పడ్డాడు.అతడు పులిచర్మాన్ని ధరించి వున్నాడు.అతడు తన చిత్ర విచిత్రం విన్యాసాలతో శత్రుమూకలను చెల్లా చెదురు చేశాడు.అతని త్రిశూలం విన్యాసం చూచి తీరవలసిందే కానీ,మాటలతో వర్ణించలేము.పఠాన్ సైనికులు ఇక పోరాడలేమని భావించి చెల్లా చెదురై పిక్క బలము చూపి తమప్రాణాలను కాపాడుకొన్నారు. ఇలా మిమ్ములను మృత్యృముఖమునుండి కాపాడి విజయాన్ని సునాయాసంగా అందించి వ్యక్తి నాతో "నీవు ఏమాత్రం భయపడవలసిన పనిలేదు.నిన్ను కాపాడేందుకే యిక్కడికి వచ్చాను.నీ భార్య నాభక్తు రాలు.ఆమె పూజలతో నేను ప్రసన్నుడైనాను"అని పలికి క్షణాల్లో మాయమయ్యాడు"అని మార్టిన్ తనలేఖను ముగించాడు.
ఆ లేఖను చదివిన ఆమె ఆనందం వర్ణనా తీతం.ఆమె కన్నులనుంచి ఆనందాశ్రువులు ధారగా స్రవిస్తున్నాయి.పరమేశ్వరుని దయా వర్షముతో తడిసి ముద్దైంది.ఆమె పరుగు పరుగును వైద్యనాథుని చెంతకు చేరి,శిరస్సు వంచి నమస్కరించింది.ఆనందాశ్రువులతోఅభిషేకించినంత పనిచేసింది.పరోపరివిధాల పరమేశ్వరునకు కృతజ్ఞతలు వెల్లడించింది.
ఇక వారం రోజులు క్షణకాలములా గడిచాయి.తన భర్త తన సర్వస్వం తనకనులముందు నిలిచాడు.తన భర్త సకుశలంగా రావడం కన్నా భార్యకింకేమి కావాలి?
భర్త రాకకైతాను పడిన ఆవేదనను,పరమేశ్వరునికరుణకై తాను ప్రార్థించిన విధానాన్ని సవివరంగా తెల్పిందామె.
ఇలా శివదీక్షా పరులైన ఆ దంపతులు వైద్యనాథమహాదేవాలయ నిర్మాణానికి పూనుకొన్నారు.
రూ||5000/లు(ఆనాటి లెక్క ప్రకారం)లతో ఆ నిర్మాణా కార్యక్రమము కొనసాగించి, పునర్మిణామును పూర్తి చేశారు.ఇదంతా క్రీశ|1883లో పూర్తియైనట్లు ఆదేవాలరములోని శిలాఫలకముపై చెక్కించారు.ఇప్పటికి ఆ శిలాఫలకం భద్రంగా వుంది.మనం ఆ శిలాఫలకాన్ని చూచి మహేశ్వరు మహిమకు మనం మురిసి పోవచ్చు.
ఇలా ఈ శివాలయం బ్రిటీషు వారితో నిర్మించబడిన ఏకైక శివాలయంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
వీరు ఇంగ్లాండు కు వెళ్ళిన తరువాత కూడా తమయింటోలో శివాలయాన్ని నిర్మించి పూజచేసేవారట.
చూశారా! అసుతోషుడైన ఆపరమేశ్వర కరుణ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి