జగదంబ మాయమ్మ శారదమ్మ
జగదంబ మాయమ్మ శారదామాతయై
వాక్సుధా ధారలు వర్ష మిచ్చు
లలితాంబ మాయమ్మ లక్ష్మీస్వరూపమై
సర్వసంపదలిచ్చి సంతసించు
శక్తిస్వరూపియై శస్త్రాస్ర్రవృధ్ధి నిచ్చి
శాత్రవుల్ నిర్జించు శక్తినొసగు
ఆన్నపూర్ణమ్మగా నఖిలజీవులకెల్ల
ఆహార మందించి నాదరించు
ఆ.వే.అంబ పలిక మన్న నటులపలికితిని
అన్య మెరుగ నట్టి యర్భకుండ
ఒప్పుతప్పులన్ని నోర్మితో దయచూచు
తల్లి కలిగి నట్టి తనయు డైతి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి