భవాయదేవాయ నమః
బ్రహ్మండ మంతట భవ్యమౌ లింగమై
వ్యాప్తించి నావయ్య వరములొసగ
అభిషేక మొనరింప నానంద మొందగా
సాంబశివునకంత సహజ మోయి
భస్మంగ రాగమే భవ్యమౌ గంధమై
ఆనంద మందుటే యతని కొచ్చు
మారేడు దళములే "మారేడు"కిష్టమ్ము
మనసార నర్పించ మరవ డెపుడు
ఆ.వే.భక్తి కలిగె నేని పరమేశ్వరాయంచు
ప్రార్త నంబు చేయ బలమునిచ్చు
అల్ప తుష్టి వలన నషుతోషు బిరుదుతో
ముదముచెంది తాను ముక్తి నిచ్చు
(రచన:౼విద్వాన్.గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి