శ్రీరాజమాతంగ్యైనమః
రాజీవ నేత్రయౌ రాజమాతంగి
రత్నసింహాసనా లాలిత్య కాంతి
ఘనమైన నీలంపుకాంతితో చెలగి
కెంజాయవర్ణంపు వలువతో నొప్పి
ముంజేతిచిలుకతో ముచ్చటల్ వినుచు
మైరేయిపానంబు మైకంబుగూర్చ
వల్లకీ వాదనా విణ్ణాన మొప్ప
తల్లిరో దండాలు దయగలతల్లి
మామాత మాతంగి మహిమతో వెలితిగా
అందుకోనీవమ్మ వందనాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి