ఉదయాస్తమానాలు
ఉదయాస్తమానాలు మురిపించు మననెంతొ
ఆశల హరివిల్లునందినట్లు
మధుమాస శిశిరాలు మనతోడ నాటాడు
ఊహలునుయ్యాల నూపినట్లు
ఉఛ్ఛ్వాస గమనంబు నిఛ్ఛ్వాస చలనంబు
వాయులీనమటుల వాస్తవంబు
అందాల యాశలు హరివిల్లుగామారు
ముసురుగా చింతలు ముసురు కొనును
ఆ. వే అలవికాని యట్టి యారటమేలకో
భ్రమలు ముంచుగాదె ప్రజలనెపుుుడూడ
ఆత్మతత్వమొకటె నానంద మందించు
మర్మ మెరుగ గానె మాయతొలగు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి