నవరాత్రులు
నవదోయ మట్లుగా నవరాత్రులరుదెంచి
జగదంప కృపనంత జగతికొసగె
లయము ముగిసె నుదయమగునింకను
జగతికంతుయునింక జనని తానె
దుర్గమ్మ తానయై దుర్మార్గ వధతోడ
ఆర్తజనులకెల్ల నార్తి బాపె
చదువుల తల్లయై జ్ఞానమ్ము నొసగిన
భారతీమాతయె మనకు బ్రాపు
సకలసంపదలిచ్చి సధ్బుద్ది నొసగిన
వరలక్ష్మితానయై వరములొసగు
ఆ.వే.అడగ కుండ మనుకు యన్నంబు పెట్టదు
తల్లియనుచు నీవు తలచ దగునె
అడగ కుండ మనకు యన్నియు సమకూర్చు
అమ్మ కరుణ కింక యంతమేది
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి