దక్షిణకాళీకా స్వరూపిని జగదంబ

ఎలకూచి వారి దక్షిణా కాళికా దేవి.
---------------------------------------------దశమహావిద్యలనే మాట విన్నప్పుడు.పది సంఖ్యకు సంబంధించిన విద్యలని సామాన్యంగా నాకు అనిపించింది.కాని పుందేవతాత్మక జపసంబంధమైన బీజాక్షరనామాలను మంత్రాలని,స్త్రీదేవతాత్మక బీజాక్షర నామాలను విద్యలంటారనీ తెలిసింది.
ఈlదశమహావిద్యలలో ఓంప్రథమంగా ఆవిష్కృతమైనది కాళికాదేవిది.ఈ కాళికా దేవికి ఒక పార్శ్వములో శ్రీరామకృష్ణ పరమహంస,మరో పార్శ్వములో నన్నయవిరచిత ఆంధ్రశబ్దచింతామణి వ్యాఖ్యాత ఎలకూచి బాలసరస్వతి నిలిచినట్లైనది.శ్రీరామకృష్ణపరమహంస జగత్విఖ్యాతమైన దక్షిణకాళికా దేవిని ప్రసన్నంచేసుకొన్న యుగపురుషుడు.ఆమె అతనికి సర్వకాల సర్వావస్థలలో సాక్షాత్కారస్థితిని అనుగ్రహించి మార్గదర్శనం చేసేవారు.
ఇక రెండవపార్శ్వములో మనతెలుగుకవి ఎలకూచి బాలసరస్వతి.ఇతడు తన ఆంధ్రశబ్దచింతమణి  వ్యాకరణం వ్యాఖ్యాన రచనను ప్రారంభిస్తూ కాళికాదేవి సుప్రసన్నో రూపమును సీసపద్యమున హృద్యంగా వర్ణిస్తున్నారు.
"చిన్నిచెందొవ విందు గన్నెగేదకిరేకు
దోపినయందంపుతురముతోడ
సరసదుర్వానవంకురగుఛ్ఛకఛ్ఛాయ
లీనునిద్దంపునెమ్మేనితోడ
కరూణారసమరంద భరసంభృతమ్ములై
తనరునేత్రారవిందములతోడ
కాలాహిక్రియనభక్తజనంబులకు భయో
త్పాదియౌనభయహస్తముతోడ
హృదయ మునకానిపించి  యుభీప్సితప్ర
బంధశబ్దార్థ విజ్ఞాన భవ్యశక్తి
యొసగు గావుత తల్లి భ
క్తాఘదురిత
లాని దక్షిణ కాళికా దేవి నాకు"
ఈ సీషపద్యం వినగానే చదవగానె మనమనోనేత్రమందు పరమదివ్యసౌందర్య భరితాత్మురాలగు కాళికాదేవి మనకు కనిపించి ఆశీర్వదిస్తున్నట్లుగా వుందికదూ!
సామాన్యంగా కాళికాదేవి భయంకరరూపముతో వున్నట్లు కనిపిస్తుంది.భయంతో మనం వణికిపోతాము.కానీ ఏదైనా మనదృష్టికోణంలో  వుంది.
ఒకసారి ధ్యానశ్లోకాన్ని అనుసందిస్తాము
"శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ ముఖీం
చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాంశివా
ముండమాలా ధరాందేవి లోలజిహ్వాం దిగంబరాం
ఏవంచింతయేత్ కాళీం స్మశానాలయ వాసినీం" ఈ శ్లోకంలో కాళికా మాత రూపం భయంకరంగా వుంటుంది.కానీ అంతరార్థాన్ని పరిశీలిస్తే అమ్మ అంతభయంకరం కాదని పిస్తుంది.
స్మశానాలయ వాసిత్వం అమ్మకేకాదూ ఆయ్యకూవుంది.కాశీనగరాన్ని మహాస్మశానం అని పేరువుండనేవుంది. ఈ పోలిక ఇక్కడితో అయిపోలేదు.
ఆత్మతత్త్వవవిచారములేని  లౌకికజీవనులు జీవన్మృతులతో సమానమేకదా! వారుండేది స్మశానములాంటి ప్రపంచంలోనే కదా! స్మశానములో సామాన్యంగా పుర్రెలు ఎముకలు మొదులైన అమంగ ద్రవ్యాలతో నిండి వుంటుంది.ఒక విధంగా సున్నితహృదయులు భయపడే విధంగా ,కలత పడే విధంగా వుంటుంది.ఇదంతా ఆత్మతత్వ విచారము లేకపోవడం వలనే కదా! ఉన్నదానికి నాశం లేదు, లేని దానికి ఉనికిలేదు అని బల్లగుద్ది చెప్పింది భగవద్గీత.
"శవారూఢాం" ,అన్నది కాళికమ్మ విశేషము.శవము పై ఎక్కినది అనికదా అర్థము."యాదేవీ సర్వభూతేషు శక్తి  రూపేణా సంస్థితా నమః తస్మై నమః తస్మై నమః తస్మై నమోనమః"అని దేవీ మహాత్మ్యం నొక్కి చెపుతుంది.సకలజీవులకు ఆత్మరూపమున వుంటు ఇచ్ఛా, జ్ఞాన,క్రియాశక్తులను కలిగిస్తూన్న చైతన్యస్వరూపమే కాళికాదేవి.ఆ అమ్మదయలేకపోతే  మనం శవాలేకదా! హల్లుల(పొల్లుల)లాంటి మనలో స్వరములాంటి ప్రాణాలను నింపేశక్తి అమ్మెకదా! జగదంబ శవారూఢ అయినది.ఆది శంకరులు తన సౌందర్యలహరిలో "శివశ్యక్త్యాయుక్తో యదిభవతి శక్తి ప్రభావతి"అని జగన్మాతను స్తుతిస్తున్నాడు‌.త్రిమూర్తులు సృష్టిస్థితిలయలనే కార్యాలను నెరవేరుస్తున్నారట.ఆదికవి నన్నయభట్టు ఆంధ్రమహాభారత అవతారికలో "శ్రీవాణీ గిరిజాస్థిరాయధధతో వక్షోముఖాంగేషు అనే శ్లోకములో మనలక్ష్మీ పార్వతీ సరస్వతులను స్థిరముగా వక్షస్థలమందు,ముఖములు,శరీరమునందు ధరించిన త్రిమూర్తులని పేర్కోవడములోనే ద్యోతకమవుతుంది. శివుని వక్షస్థలముపై నిలుచున్న చిత్రం వెనుకనున్న ఐతిహ్యం అందించే సందేశమిదే.అప్పుడు శవారూఢాం అనే భీకరార్థం మారి,జీవితంలోని చైతన్యమే అమ్మ.అమ్మలేకుంటే జీవి బ్రతుకు శవ ప్రాయమే.
ఇక" మహాభీమాం"-అనే అంతరార్థాన్ని తెలుసుకొందాం.జగదంబ రెండు హస్తముద్రలు అవి వరదాభయముద్రలు.లోక కంటకులకు ప్రళయభీకరము,ఆశ్రితులకు అభయదానం‌‌.ఇవి రెండు జగదంబ వాడే రెండు ముఖ్యసాధనములు.
"కాలాహి క్రియ అభక్తజనంబులకు భయోత్పిదియౌ నభయహస్తము.భక్తిరహితులూ,లోక కంటకులకు కాలసర్పములా భయంకలిగించే ఉత్పాతము ముంచుకు వస్తుందని నిరూపించడానికే" మహాభీమాం"అనే పదప్రయోగం జరిగింది.
"ఘోరదంష్ట్రాం" అన్న విశేషణము కూడా అమ్మ భయంకర రూపాన్ని గుర్తుకు తెస్తాయి.మిక్కిలి భయంకరమైన కోరలుగలగినది.కాలసర్పంలాంటి భయంకరమైన కోరలు దుష్టశిక్షణార్థమే.
లోకాలను సంహరించడానికి,అవే లోకాలను ప్రవృధ్ధి చేయడానికి నేనే కారణమంటు "కాలోస్మి లోక క్షయకృద్ ప్రవృధ్ధో" అని శ్రీకృష్ణుడు  శ్రీమద్ భగవద్గీతలో విశ్వరూపం సందర్శన యోగంలో చెప్పనే చెప్పొచ్చు."స ఏవకృష్ణః స ఏవకాళిః"అని శ్రీవిద్యోపాసకుల మాట.ఖఢ్గం,మానవకపాలము వంటి భయంకరమైన వస్తువులెన్ని వున్నా,వరములను ప్రసాదించడానికి,అభయప్రదానం చేయడానికి మంగళప్రదమైన రూపము తో అమ్మవారు శివ స్వరూపము తో సదాసిధ్ధంగానే వుంటారు‌ .కపాలమాలధరించే జగదంబ విద్యాస్వరూపిణిగా చెప్పడం జరిగింది‌.సంస్కృతభాషలో యాభై(50)అక్షరాలకు ప్రతీకగా యాభై నరకపాలముల మాలను ధరించినది.క్షరము కానిది అక్షరము కదా! అక్షర సంబంధమైన,పునరావృత్తిరహిత మోక్షసామ్రాజ్యమునకు మూలము జ్ఞానమే కదా! అది మనకు అంతిమలక్ష్యము






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత