అనామయస్తవ శ్లోకము

దండి విరచిత అనామయస్తవ శ్లోకరాజము-------------
యోగీ భోగీ విషభుగమతః శస్త్రపాణీ తపస్వీ
శాంతఃకౄరః శోభిత విషయం శైలకన్యా సహాయం
భిక్షావృత్తిః త్రిభువన పతిః శుధ్ధిమానస్థిమాలీ
శక్యోజ్ఞాతుం కథమివ శివః త్వం విరుధ్ధస్వభావః"
ఓం పరమేశ్వరా! నీవు పరస్పర విరుధ్ధస్వభావము కలవాడవు.అది ఎట్లనగా
నీవు యోగిని,యోగిత్వం కలవాడివేకావు.భోగివి కూడా! సర్పములను హారములుగా ధరించేవాడవని చమత్కారాలు.అందరు బంగారు ఆభరణాలును ధరిస్తారుకానీ నీవేమో పాములను హారములుగా ధరిస్తారు.నీవు కాలకూటవిషమును ఆహారంగా సేవిస్తావు.కానీ నీవు అమృతస్వరూపుడవు.నిన్ను నమ్మినవారికి అమృతస్వరూపమును ప్రసిదిస్తావు.నీవు శాంత స్వరూపుడివి.మంగళస్వరూపుడవు.కౄరుడవు(ఆ కౄరత్వము లోకకంటకులైన  దుష్టుల విషయములో) శమితవిషయః ఇంద్రియ సుఖములను వర్జించినట్టి ధ్యానముద్రా ముద్రితమైన వాడివి. కానీ పార్వతీదేవిని పరిణయమాడిన గృహస్థాశ్రమమును స్వీకరించితివి.
భిక్షావృత్తిని స్వీకరించడంతో పాటు త్రిభువనములకు నీవే అధిపతివి.భిక్షావృత్తి, త్రిభువన పతిత్వములు ఇవి రెండూ పరస్పరభిన్నములైనవేకదా!త్రిశూలమును పాపమును హస్తములందు ధరించిన వాడివి.అంతటి ఆగావా? ఆగలేదు సరికదా! నీవు తపోముద్రాముద్రితుడైనవాడవయ్యావు.
నీవేమో నిత్యశుధ్ధుడవు.చాలా పవిత్రమైన వాడివి.అంతటితో ఆగితే ఏమి బాగుంటందనుకొన్నావేమో! ఎముకలను పూలమాలగా ధరించావు.
ఈ విధముగా పరస్పర విరుద్ధమైన స్వభావములుకల నిన్ను అర్థం కాలేదు చేసుకోవడం ఎవరి తరము?
ఇవన్ని నీపూర్ణత్వాన్నిమాకు తెలియు జేయడానికి  కొండగుర్తులేమో!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత