విఘ్నరాజు వినాయకుడు
ప్రణవస్వరూపుడై ప్రార్థించు వారికి
కొంగుపసిడిరీతి కోర్కె నొసగు
ఏకదంతుడితడు యేలిక మనకెల్ల
మోదక హస్తుండు మోదమొసగు
హస్యరసపువేల్పు హర్షంబు వర్షించు
నర్తించు నటరాజ నందనుండు
ఆదిదేవుడితడు ననితరసాధ్యుండు
ఎలుకనెక్కితిరుగు వేల్పు మనకు
ఆ.వే.ఇరవదొక్క పత్రి యింపుగా గైకొన్న
పెద్ద బుధ్ధి కలుగు దొడ్డ వాడు
వెలగ పండ్ల నొసగ వేడ్కతో గైకొన్న
విఘ్న రాజు కివియె వినతు లయ్య
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి