బిల్హణస్తవ శ్లోకములు
బిల్హణ స్థవము
---------------------
బిల్హణమహాకవి కాశ్మీరదేశీయుడు.కాని కొన్ని అనివార్యం కారణాలు వల్ల కర్ణాటదేశాన్ని తన నివాసస్థానముగా చేసుకొన్నాడు.ఇతడు క్రీ.శ. 10వశతాబ్దికి చెందిన వాడని చరిత్రకారులు అభిప్రాయము.చోరపంచాశిక,విక్రమాంకదేవచరిత్రము, శివస్తోత్రములు ఇతని రచనలు.బిల్హణస్తవమున తనకుకలశివభక్తిని తనకుగలకవితాచమత్కృతితో అనన్యసామాన్యంగా వర్ణించడం జరిగింది.
బిల్హణస్తవములొని శైలి పరమేశ్వరునితో పరాచికాలాడుతున్నట్లుగా పైకి కనిపిస్తుంది.అంతర్గతంగా శివభక్తితొణికిస లాడుతుంది.
శివభక్తుడైన మల్హణమహాకవి
"శాఠ్యేన యే~పిభగవంతమనంత శక్తిః
శంభోః భవంతి భవినో నమంతి
తే~ప్యంధకారమతిఘోరకృతాంతదంత
యంత్రాంగంతో రాళగహనం నపునర్విశంతి"
ఓం పరమేశ్వరా!అనంతశక్తిసంపన్నుడూ,అభవుడైన నిన్ను చిత్తశుధ్ధిలేని నరులు కొంటెతనముతోనైనా నిన్ను స్మరించి నమస్కరించినచో మిక్కిలి భయంకరమైన జన్మమృత్యుపరంపరలను పోందరుకదా! "చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి.
శివపూజకుపనికిరానిదైన మొగలిపూవు ను బిల్హణమహాకవి ఎలా ఓదారుస్తున్నాడొ చూద్దామా!
""భోభో!కైతకపుష్ప! సౌరభనిధే! ఖేదం మాకృథాః
దృష్ట్యా మూర్ధ్ని మహేశ్వరస్య రచితా అర్క ప్రసూనావళిం
అస్థిత్వాభరణస్పృహం విదధతః క్షారునులిప్తా22కృతే
ర్నగ్నీభూయ చనృత్యత్యో2స్యచరితం సర్వం సఖే! తాదృశాః"
ఓమొగలిపువ్వా! సువాసనకు నిలయమైన నిన్ను శివుడు తనపూజకు అర్హముకానిదిగా చేసినాడని బాధపడకు.సువాసనలేని,దుర్వాసనగా భరితమైన జిల్లేడు పూలమాలలను ధరించినాడని బాధపడుతున్నావా! బాధపడకు.బాధ పడి ప్రయోజనముఏమాత్రమూ లేదు.ఎందుకంటె ఎముకలను హారములుగా తనకంఠమున ధరించ వలెనని ఆసక్తికలవాడుlభస్మమును తనశరీరమున పూసుకొనేవాడు,దిగంబరంగా నృత్యం చేయువాడైన అతని ప్రవర్తన ఇలాగే వుంటుంది కదా !అని సరిపెట్టుకోక తప్పదు.
మహేశ్వరుడు మొగలిపూవు అసత్యం పలికినందుకు శాపం యివ్వడం అందరికీ తెలిసిందె.దానిని ఆధారంగా చేసుకొని మొగలి పూవును ఓదారుస్తున్న నెపముతో సాఃబశివుని భక్తసులభత్వాన్ని,అతని నిరాడంబరమైన అలవాట్లను వ్యంగ్య ధోరణితో ప్రశంసిస్తున్నాడు.
పరమేశ్వరుని బాహ్యరూపము వింతగా అనిపించినా,అతని మహాత్మ్యము లోకాతీతమైనదేకాక ఆలోచనా రమణీయమైనదే కదా!
బిల్హణకవి శివస్తుతి
ఈశ్లోకములో మహేశ్వరుని సోమరితనం కలవానిగా వర్ణిస్తున్నట్లు బయటికి కనిపిస్తుంది(స్థూలంగా)
అంతర్గతంగా జగత్సృష్టి స్థితిలయములలో నిరంతరాయంగా అలసటనులేక్క చేయనివానిగా బిల్హణకవి వర్ణిస్తున్నాడు
"సస్యారోపణ రక్షణా2క్షమాతయి భిక్షాటనం నిర్మితం
కఛ్ఛగ్రంధనమోచనా2లతయా-వాసో దీశఃకల్పితాః
శాణాన్వేషణ ఘర్షణాలతయా -భస్మాంగరాగాఃకృతః is
విశ్వోత్పిదన రక్షణాపహరణా యాసస్త్వయా నేక్షితః"
ఈ సకల విశ్వానికీ నీవే అధిపతివి. ధాన్యం పండించుకోవాలంటే ఎక్కడైనా పండించు కోవచ్చు.పొలం దున్నడం,విత్తనాలు విత్తడం, పండిన పంటను కాపాడుకోవడం ఇవన్నీ చిక్కులూ వుంటాయికదా! ఇవన్ని ఎవరుచూసుకొంటారు లెద్దు అని బధ్ధకంతో బిక్షాటనమే వృత్తిగా జీవనోపాధిగా చేసుకొన్నావు కాబోలు.
ఇక వస్త్రాలను ధరించే ఓపికలేదు సరికదా! కౌపీనం ధరించడానికి విప్పడానికీ ఓపికలేక దిగంబరుడైనావు
శ్రీ గంధపు చెక్కను సాననుఎప్పటికప్పుడు వెదికి తెచ్చుకొని అరగదీసి వ్రాసుకోవడానికి ఓపిక లేక భస్మమునుశరీరమునకు సుగంధంగా వ్రాసుకొంటున్నావు.
కానీ సృష్టిస్థితి లయములనే గొప్ప కార్యాలను అనాయాసంగా నిర్వహిస్తున్న నీకు ఈ పనులు లెక్కలోనివికావు కదా!
ఇలా నీవు బిక్షా భోజనుడుగా ,దిగంబరుడివిగా,భస్మాంగధారిగా వుండటంతో గొప్పపరమార్థమే దాగుంది.పరమేశ్వరుడు ఏ సుఖముకోరుకోని విరక్తుడుకానీ భువనభరభంగ వ్యసన నిమగ్నుడు .సమస్త భువనమువ భయమును ఎలా పోగొట్టాలా ? అనే ఆలోచనలో నిమగ్నుడు కాబట్టే ఇలా వున్నాడని మనం అర్థం చేసుకౌవాలి.
బిల్హణుని సదసత్సంశయము---
తనను జనన మరణ సంసార చక్రమునుండి విముక్తిని కావించి మోక్షమును ప్రసాదించమని భగవంతుని ఎంత చమత్కారముగా భక్తుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు
"ఆయుషి మహంతి విలంబో
భవతి భవత్పాద పంకజ ప్రాప్త్యై(ప్తౌ)
హీనే భవదారధాన
విఘాత ఇత్యుభయథా2పి కింకుర్మః"
మాకు పూర్ణాయుర్దాయము వుంటే చాలాకాలము వరకు నీసన్నిధికిచేరి నీపాదపద్మములను అందుకోజాలము.నీసామీప్యసౌఖ్యము పొందుటకు చాలా ఆలస్యమగును కదా! అని ఒక భయము.
ఒకవేళ ఆయువు తక్కువే అయిన అదీ ప్రమాదమే.ఎఎందుకంటే నిన్ను ఎక్కువ కాలము పూజించలేము కనుక నీసేవకు విఘాతము కలుగును.కనుక ఇలాఎటుచూచినా మాకు అపకారంగానే తోస్తుంది.మేము ఎటూ నిర్ణయించలేదు పోతున్నాము.కాబట్టి మాకు జన్మమే లేకుండా చేయుము అని ప్రార్థిస్తున్నాము.
శివా! నీ యిష్టమే మాయిష్టము
------------------+++-----------------
స్వామీ! నీకిష్టమైనవన్ని మాకు యిష్టమునచనట్లే ,మాకు తప్పదు కదా!
"శివంకరోతి యితి శివః"శుభములను మంగళములను కలిగించు వాడవు నీవైనప్పుడు నీవారందరూ మాకు కావలసినవారే.
వ్యాళేభ్యో2స్తు నమః పిశాచసదనే -న్యస్తః ప్రణామాంజలిః
నమ్రాః స్మోనృకపాల దామని-చితా-భస్మా2భి వందామహే
జినుభ్యాం ప్రణిపత్యచాటువచనైః-సంతోషయమో వృషం
కింకుర్మః పరమేశ్వరస్యచరితం--విజ్గాయ వర్తామహే"
ఓమహేశ్వారా! నీకే కాదు నీసర్పహారములకు నమస్కారము.నీసభాభవనము పిశాచ సదస్యులచేత కూడుకొన్నదికదా వారికి చేతులు జోడించి నమస్కారము చేస్తున్నానుఎందుకంటే ఎంతైనా వారు నీసదస్యులుకదా!నీవంటి మహాత్ములను ఆశ్రయించాక వారికిలౌటేమి? వారూ గొప్పవారే.నువు ధరించినకపాలమాలకు వినయముతో వంగి అభివాదము చేస్తాము.నీవు వ్రాసుకొనే చితాభస్మమునకు నమస్కారము.నీవు ధరించడం వల్ల,ఆ చితాభస్మమునకు కారణమైన ఆ శరీరము ఎంతధన్యమైనదో !నీవు ఆనందంగా నందీశ్వరునియెక్కి తిరుగుతుంటావుకదా!మేము ఆ వృషభానికి మేము మోకరిల్లి నమస్కారముచేస్తూ ఈ వృషభమును పొగడ్తలతో ముంచెత్తగలము.నీ స్వభావానికి అనుభవపూర్వకంగా తెలుసుకోని మేము ప్రవర్తించాలి కదా!
కుశల ప్రశ్నలు:---
మాకు ఏడుగడైన మిమ్ములను,మీ వారిని కుశల ప్రశ్నలు వేయడం మా బాధ్యత.
"అపికుశలినః ప్రేతావాస --స్థలీ సహవాసినః
ప్రమథపతయః--కఛ్ఛి జీర్ణః సుఖీ తావ శాక్వరః
అపిచ సులభా-భిక్షావృత్తిః జగత్రయనాథతే
నఖలు శిథిల--ప్రాంతః కింతే గజాజిన కంబలః"
భగవంతుడు భక్తపరాధీనుడు కదా! మనజపాలకు తపాలకు ముగ్ధుడై మనముందు ప్రత్యక్షమైన ఆ భగవంతుని యోగక్షేమాలు ఇలా అడగవచ్చునని బిల్హణమహకవి ఇలా ఊహిస్తున్నాడు.
"నీవు నివసించే ప్రేతావాసమైన స్మశానమునీకు అనుకూలముగా బాగా వున్నది కదా!నీ సహవాసులైన ప్రేతములు కుశలముగా నున్నవా?నీ సైన్యగణము లైన ప్రమథాది పతులు సౌఖ్యముగా వున్నారా? నీవాహనమైన మసలిదైన నందీశ్వరుడు సుఖముగా నున్నాడా? లోకత్రయమునకంతటికీ నాథుడనిపించుకొన్న నీకు జీవనాధారమైన బిక్షాహారము సులభముగా లభించు చున్న దిక్కులా?(విచిత్రమేమంటే లోకత్రయమునకంతటికి నాథుడైన పరమేశ్వరుడు బిక్షాటనముచేయుట విశేషము.అదికూడా ఆదిభిక్షువు) ఆ బిక్షము సులభముగా లభించు చున్నదికదా అనీభగవంతుని భక్తుడుయోగక్షేమాలడుగుతూన్నాడు.నీవు వస్త్రముగా ధరించే గజచర్మము చినిపోకుండా బాగా వున్నది కదా!
అని భోళాశంకరుని బిల్హణుడు ప్రశ్నిస్తున్నాడు
బ్రహ్మదేవుని ముదిమదితప్పిన మొదటి వేల్పని లోకంలో గిట్టనివారు ప్రచారం చేస్తూ వుంటారు.దానికి సాక్ష్యంగా ఎవరికీ పనికిరానట్టి అనవసరం వస్తువులను సృష్టిస్తాడిని అందరు అనుకొంటుంటే, పరమేశ్వరుడు బ్రహ్మదేవునకున్న ఆ చెడ్డ పేరు పొగొట్టడానికి ఆ వస్తువులను తానే స్వీకరించి,అవిమంచివేనని నిరూపించాడు.
"దత్తూరాణి శిరస్రజం పితృవనం వాసం విషం భోజనం
సర్పాశ్చాభరణాని భస్మం తిలకం వృధ్ధోక్ష మారోహణం
శ్రేయాన్ పారిషదా స్వనిధాయ మమృజే దుర్మేధనో వేదసః
త్రైలోక్యానుపయోగి వస్తురచనా వైఫల్యదోషాత్వయా"
ఓ శివా! ఉమ్మెతపూలను తలపై మాలలుగా ధరించాడు.స్మశానమును నివాసస్థలముగా మలచుకొన్నావు.పాములను ఆభరణములు గా,భస్మమును తిలకముగా ,ముసలి యెద్దును వాహనముగా ,ప్రేతములను సభాసదులుగా చేసుకొన్నావు.
బ్రహ్మ అల్పబుద్ధి కలవాడు.అతడు మూడూలోకములలోను ఏ ప్రాణికి ఉపయోగపడని వస్తువులను చాలావాటిని సృష్టిస్తాడని,అతని విషయమును నున్న కలదోషాన్ని అపకీర్తినీ పొగొట్టావు అని శివుని ఉదారతను బిల్హణమహాకవి ఈ విధంగా కీర్తించాడు.
మహాదేవుడైన పరమేశ్వరుడు వానిని స్వీకరించినందున ఆవస్తువులకు గొప్పదనం పెరిగింది.మహేశ్వరుని ఉదారత వెల్లడైనది.
పరమేశ్వరునకు అసుతోషుడనే ముద్దుపేరుంది.(ఈ పేరును కాస్తా బెంగాలీ బాబులు సొంత చేసుకొన్నారు
అసుతోషుడంటే అల్పసంతోషి అనే అర్థము.ఈ అల్పసంతుష్టివల్ల తమ ఇష్టదైవం నష్టపోతున్నాడనే భక్తుని బాధను బిల్హణమహాకవి ఇలా వ్యక్తం చేస్తున్నాడు.
"గృహ్యాతాం వసనేషు చర్మభుజగోహారేషు యానేషుగౌర్
దుత్తూరంకుసుమేషు నా2త్ర రుదిమః కింత్వత్ర కంపామహే
అబ్దౌ కౌస్తుభ కాలకూటకమలా కల్పద్రుమోచ్చైఃశ్రవః
పీయుషాదిషు సత్సు తాత!భవతా-యః కాలకూటగ్రహః"
ఓ పరమేశ్వరా! ఎన్నో విధాలైన మంచి మంచి వస్త్రాలుండగా గజచర్మమును వస్త్రముగా ధరించినావేమి? ఎన్నో మంచి మంచి హారములుండగా పాములను హారములుగా చేసుకొన్నావేమి?సువాసనా భరితములైన అందమైన పూవులు ఉండగా ఉమ్మెత్త పూవును పూజాపుష్పములుగా గ్రహించావు.
ఈ అల్పవిషయములపైని నీకుకల అభిరుచిని గురించి మేముబిధపడుటలేదు.
కానీ క్షీరసాగరమధనం సందర్భమున సముద్రమును ఉండి కౌస్తుభమణి,కామధేనువు,కల్పవృక్షము,కాలకూటవిషముకమలాలయ,ఊఛ్ఛైశ్రవము,అమృతము మొదులైన ఎన్నో వస్తువులు లభ్యమొనప్పుడు, వాటినన్నిటినీ వదిలి,కాలకూటవిషమునే గ్రహించుట మాకు బాధకలిగించింది.నీ అమాయకత్వాన్ని చూచి మేము బాధపడుతున్నారు.
కానీ పరమేశ్వరుని అంతరంగమున కాలకూట విషభక్షణమున లోక లక్షణమే లక్ష్యము.ఎందుకంటే పరమేశ్వరునకు భువనాలభయమును పోగొట్టడమే అతని ఈ చర్యకు ప్రధానకారణం ము.
భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తాడు!
-------------+++----------------------
మహాభక్తుడైన బిల్హణమహాకవి పరమేశ్వరుని భక్తిసులభత్వాన్ని చమత్కారంగా హృద్యంగా వర్ణిస్తున్నాడు.
పరమేశ్వరుడు ఆదిభిక్షువు కదా! యాచనకు వచ్చిన ఆదిభిక్షువు భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తాడు.
"ఉత్తరంగమదిమస్తకగంగా
వారిధారయసి వారిజగంధి
కిం వయఃచుళకబిల్వదళై స్తేః
భిక్షురుజ్ఝటి కదాచనలాభం"
ఓం పరమేశ్వరా! నీశిరస్సునందు పెద్ద అలలతో కూడిన గంగానదిని దర్శించారు.ఆ నదిలో సుగంధభరితమైన పద్మాలుఎన్నోగలవు.ఇట్టీనీకు భక్తులు యిచ్చె పుడిసెడు అభిషేకం జలముతో, కాటువాసనవేయు బిల్వదళములతో కలుగు ప్రయోజనమేమున్నది? అయినా వాని నన్నిటినీ స్వీకరిస్తున్నారు. భిక్షకుడు ఏకొంచెం లాభము వచ్చినా వదులుకోడు.
శివుడు భిక్షావృత్తితో జీవించుటను ఆధారము చేసుకొని చమత్కార కల్పనం జరిగింది.
మహేశ్వరునకు ఏకోరికలు లేకున్నను,ఏ ప్రయోజనము ఆశించకున్నను,భక్తులను అనుగ్రహించడానికై భక్తితో వారిచ్చిన యిచ్చిన ఏ అల్ప పదార్థాన్నైనా స్వీకరిస్తాడు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా
"పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయోచ్చతే "అనే అంశాన్ని కవిచమత్కారంగా గుర్తుకు తెస్తున్నాడు.బిల్హణుడు తనకుపరమేశ్వరునితో ఉన్న చనువుతో శివుని ఇలచమత్కారంగా వ్యాజనింద చేస్తున్నాడు.
శివుని కున్న అనేకనామాల్లో అనామయ నామమే కవితా చమత్కారానికీ ఆధారంగా నిలిచింది.ఆమయము అంటే రోగములేక వ్యాధి.అనామయుడు అనగా తనయందు ఆమయము లేనివాడు.అంతేకాదు తనను నమ్మిన వారికి కూడా వ్యాధిలేకుండా చేస్తాడని యర్థము
"విత్తేశస్య కుబేరతా నవిరత--నీహార భానుక్షయీ
హేరంబస్య మహోదరం నగళితం దైత్యారి రుఛ్ఛైర్గదః
అంగం భృంగిరేటేశ్చ పాండుభృశ్యమి--త్యాస్తామమీషా కదా
త్వంశూలీతి విగీయసే కథమహో భక్త
స్తనా2మయః"
నీవు అనామయుడవు.నీకు ఏవ్యాధులు లేవు.నిన్ను ఆశ్రయించిన వారిరోగాలను పోగొట్టేవాడివని నిన్ను స్తుతిస్తున్నారు. కానీ నిన్ను ఆశ్రయించిన వారిలో కుబేరుని యొక్క కుబేరత్వం(అసహ్యకరమైన శరీరము)పోలేదు.చంద్రుని క్షయవ్యాధి పోలేదు(శుక్లపక్షం లో పెరుగుదల కృష్ణపక్షంలో తరుగుదల మనకు తెలిసిందే కదా! దీనిని కవి క్షయవ్యాధిగా చమత్కరిస్తున్నాడు) ప్రియమిత్రుడు దైత్యారి యైన విష్ణవునకు ఉఛ్ఛైరగదత్వం పోలేదు.విష్ణవుకు గదాధర నామము సుప్రసిద్ధ ము."గదము"అన్నదానికి రోగమని ఆయుర్వేదమున పేరుంది.ఇక నీకుమారుడైన వినాయకునకు లంబోదరుడు అనిపేరు.అతని పెద్దపొట్టకరుగలేదు. నీభక్తాగ్రగణ్యుడైన భృంగిరిటికి పాండురోగమూ పోలేదు. ఇక నీవిషయమంటావా! నీవుశూలివి .ఎందుకంటే త్రిశూలము ను ధరిస్తాను అని ఒక అర్థమైతే శూలరోగపీడితుడవు అని మరో అర్థము. ఈ రకంగా నీవు నీ వారు అనామయులుకాకున్నారనే మాబాధ అనికవి అంటున్నాడు.
ఇక అంతరార్థమునకొద్దాము. అనామయము పదమును ఆ--నా--మ--య అనివిడదీసిచూస్తే అసలు అర్థము తెలుస్తుంది."నామ--న--యాతి ఇతి అనామయ"అంటే స్వారస్యం తెలుస్తుంది.నీవు నామరూపరహితమైన శుధ్ధ జ్ఞాన ప్రకాశం కలవాడని అంతరార్థము.తైత్తిర్యోపనిషత్ లో చెప్పిననట్లుగా "సత్యం జ్ఞానమనంత బ్రహ్మ "అనే పరబ్రహ్మ స్వరూపలక్షణాలు కదా!
ఇలా బయట కనిపించే అర్థము,అంతర్లీనంగా దాగిన మహోన్నతమైన అర్థము బిల్హణుని కవితా చమత్కారానికీ, అతనికీ భగవంతునికికల ఆత్మీయబంధానికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
భక్త సులభుడు భగవంతుడు
----_----_------_-----_----_------
భగవంతుడు భక్తి మాత్రసులభుడు.భక్తపరాధీనుడు.భగవంతుని ప్రసన్నము చేసుకోవడానికి ఆడంబరమైన వైభవాలు సంపదలు ప్రదర్శించక్కరలేదు.
భగవంతుని ప్రసన్నడను చేసుకోవడానికి ఆర్భాటంగా పలుప్రయత్నాలు చేస్తారు. తమవైభవాన్ని ప్రదర్శిస్తారు.కానీ ఇవన్ని అవసరంలేదని బిల్హణమహాకవి పరమేశ్వర భక్తసులభత్వాన్ని ఇలా నిరూపిస్తున్నాడు.
"ప్రాసాదై స్తవ కిం శశ్మాన వసతేః స్నానైః కిమస్తి స్పృశః
కింవస్త్రైః దిగంబరస్య భసితా లేపస్య గంధైశ్చకిం
కింధూపైః శవ ధూప ధ్రూమ వపుషః కింకాలకూటాశినో
నైవేద్యరితి భక్తిమాత్ర సులభం త్వాందేవ సేవామహె"
ఓ పరమేశ్వరా! శశ్మానం లో నివసించడానికి అలవాటు పడ్డావు నీవు.అందుకే నీకోసం పెద్దపెద్ద భవనాలను దేవాలయాలను నిర్మించవలసిన పనిలేదు. ఎముకలను హారములుగా ధరించే నీకు అభిషేకాలు చేవలసిన పనిలేదు.దిక్కులే వస్త్రాలు గా చేసుకొని దిగంబరంగా సంచరించే నీకు వస్త్రాలు అవసరంలేదు.చితాభస్మాన్నే సౌందర్య సాధనంగా ధరించే నీకు శ్రీగంధాది సువాసనా ద్రౌవ్యాలతో పనియేమి?
కాలకూటవిషమునే ఆహారంగా భుజించే నీకు నైవేద్యాలు అర్పించవలసిన పనిలేదు.
ఇన్ని కారణాలతో నీకు ఏ ఉపచారమూ చేయుము.పైగా నీవు చిత్తశుధ్ధికలవారినే సులభంగా అనుగ్రహిస్తాడు.అందుకే మేము నిర్మలమైన భక్తితో నిన్ను పూజిస్తామూ,సేవిస్తాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి