పతిభక్తి
పతియె తమకెపుడు ప్రత్యక్ష దైవంబు
పతియెగతియనుచు భావ శుధ్ధి
కలుగువారెల్లరు గతకాల మీరితి
సౌభాగ్య వతులైరి సంతసాన
ఆదియెట్లు యిదియెట్లు ననకుండ తామంత
గార్హస్థ్య ధర్మాన్ని కర్తవ్య దీక్షతో
పాటించి తామంత ఫలము నంది
ఆదర్శ మూర్తులై యవత రించి
ఉభయవంశములెల్ల నుద్దరించిరివారు
ఆ.వే.సూర్యగమన మాపె సుదతియెక్కపలుకు
పతిని కాచె భార్య భాగ్యమహిమ
ఇతిహసంబు మనకు నింపైన రీతిగ
ధర్మ మర్మ మిదియె ధాత్రిలోన
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి