కర్ణాటక సంగీతమూ-- పురందరదాసు

కర్ణాటక సంగీత పితామహుడు- అని జగత్ప్రసిధ్ధి చెందిన పురందరదాసు
---------++++++++---------------------
పురందర దాస పదగళు అని పిలువబడే పురందర దాసు కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆధారభూతంగా నిలిచాయి.
సంగీత సాధనకు అవసరమైన ప్రాథమిక విద్యనుఅభ్యసించే విద్యార్థులకు  అవసరమైన పాఠాలను సమగ్రంగా సిద్ధం చేశారు.ఇది వీరి నిర్మాణాత్మక మేధా సంపత్తిని తెలియు జేస్తుంది.
పురందర దాసుల పిళ్ళారీగీతాలలో మొట్టమొదటి గీతం సుప్రసిద్ధం.
పల్లవి:-శ్రీగణనాథ-సింధూర వర్ణ
కరుణా సాగర-కరివదన
లంబోదర-లకుమికరా!
అంబాసుత-అమర వినుత
1చ.సిధ్ధచారణ గణసేవిత
సిధ్ధివినాయకతేనమోనమో
లంబోదర-లకుమికరా!
అంబాసుత అమర వినుత
2చ,సకలవిద్యా-ఆదిపూజిత
సర్వోత్తమ తేనమోనమో
లంబోదర-లకుమికరా!
అంబాసుత అమర్ వినుత"
ఈ కీర్తన రాని వారెవరూ వుండరనుకొంటా!
సంగీతాన్ని అభ్యసించె విద్యార్థుల స్థాయికి తగినట్లు అభ్యాసాలను పురందరదాసు లు నిర్ణయించారు.సరళవరుస జాతి స్వరాలు,హెచ్చుస్థాయి స్వరాలు,తగ్గుస్థాయిస్వరాలు,అలంకారాలు,అనేవి విద్యార్థుల స్థాయికి తగినట్లు పురందరదాసులు నిర్ణయించారు.
కర్ణాటక సంగీతములో తాళపద్దతి మిక్కిలి కష్టతరమైన సంక్లిష్టమైన వ్యవస్థ.సంగీతమునకు సంబంధించిన ప్రాచీన గ్రంధాలు 108తాళాలుగా నిర్ధారించాయి. కానీ పురందర దాసులు కేవలం 35,తాళాలనే గ్రహించాడు.ఇలా పురందరదాసులు సిధ్ధపరచి,నిర్ణయించిన శాస్త్రీయ సంగీతశిక్షణా వ్యవస్థ శతాబ్దాల తరబడి అనుసరింపబడి నేటికీ  అదే శైలిలో కొనసాగుతున్నది.
శాస్త్రీయ సంగీతంలో మొట్టమొదటి పాఠం మాయా మాళవగౌళంలో బాగుంటుందనే అంశాన్ని పురందరదాసు లు గుర్తించారు.హిందూస్థానీ సంగీతంలో మాయామాళవగౌళమునె భైరవీరాగం అంటారు.ఇది సంగీత శిక్షణనివ్వడినికి ఈ రాగం సులభంగా వుంటుంది.
కర్ణాటకసంగీతంలో  ప్రాథమిక స్వరాలన్ని మాయామాళవగౌళములోనే వుంటాయి.
నారదమహర్షి నెలకోల్పదలచుకొన్న సంగీత వారసత్వాన్ని బలమైన పునాదులు పైనే నెలకొల్పి ,దానికొక విశిష్టమైన గొప్పదనాన్ని చేకూర్చాడు.
ఇక మనం పురందరదాసు లో వారి సంకీర్తనానంద మగ్నులమవుదాము.
నామికి నామానికి ఉన్న అనుబంధాన్ని వ్యంగ్య మర్యాదతో అందంగా చమత్కార పూరితంగా వర్ణిస్తున్నాడో చూద్దాం.
పల్లవి:--నీన్యాకో నీన్న హంగ్యాకో రంగ!
నిన్ను నామదబలవందిద్దరే సాకో!
(ఓం పాండురంగా! నీవెందుకు నీహంగూ ఆర్భాటలెందుకు నీ నామము యెక్క బలముంటే చాలుకదా!)
అని అంటు నామము యొక్క గొప్పదనమును వర్ణించడానికి ఉదాహరణలుగా గజేంద్రమోక్షకథ,ప్రహ్లాద వృత్తాంతము,ద్రౌపదీ మానసంరక్షణ,అజామీళునికథ,ద్రువొ పాఖ్యానము ఇవన్ని తనకీర్తనలో  పొందుపర్చాడు.
విష్ణు సహస్రనామ ఉత్తర పీఠికలో "సంకీర్త్యనారాయణశబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు" అన్న సూత్రానికిళసోదాహరణలిచ్చినట్లైంది.
"కరిమకరిగె సిక్కి మొరియిదువాగ
పరమపురుషహరినామవకాయితో"
అన్న చరణములో గజేంద్ర మోక్ష కథను మనముందుంచాడు.ప్రహ్లాదవరదుడు నామపారాయణ ప్రీతుడేకదా!
ద్రౌపదీ మాన సంరక్షణ జగద్విదితము.
కౄరాత్ముడైన అజామీళుడు నారియణా అని తనకొడుకును పిలిచినా తననే పిలిచాడని భావించి యమదూతలను శిక్షించి అజామీళుని రక్షించడం నామమహిమయేకదా!
"నిన్నునామకె సరికాణెనుజగదొళు
ఘనమహిమ సిరి పురందర విఠల"
అంటు కీర్తనను ముక్తాయిస్తూ నీ నామము కన్నా మించినది మరొకటి మహత్తుగలిగినది జగతిలొలేదుకదా!  అంటూ నామమహిమను అనన్యసామాన్యరీతిలో ప్రకటించారు పురందరదాసులు.
సమాజంలో విభిన్న వ్యక్తులూ,వారి మనస్తత్వాలను బాగా పరిశీలించాడు.వారి భోగలాలసత, ఇహలోక లాంపట్యముల పై తీవ్రవిమర్శను కావిస్తూ,పన్నగశయనుని శరణువేడి తమజన్మను సార్థకం చేసుకోమని సందేశమిస్తున్పాడు ఈ కీర్తనలో!
ఈ కీర్తన ఉత్తమపురుషకథనంలో సాగినప్పటికి ,అది గురితప్పక శ్రోతల మనస్సులను తాకీ వారినీ దీర్ఘాలోచనలో  పడేస్తుంది
పల్లవి:--నానుమాడిదకర్మ బలవంతం వాదరే
నీవుమాడువదేవదేవ!
నేను చేసిన కర్మ బలమైనది యైనప్పుడు,నీవైనా ఏమి చేయగలవు?
అనుపల్లవి:--సామాన్యవల్లవిదు బ్రహ్మబరెదు బరహ
నేమందిందలి యెన్న వణయల్లి బరుదుకె"
ఈ రాత సామాన్యమైనదా కాదు కానేకాదు . బ్రహ్మ రాసిన నుదిటిరాతను తప్పించడం సాధ్యమా
లలాట లిఖితా రేఖా పరిమార్థం నశక్యతే "
"అతిథిగళిగెనా అన్నకొట్టవ నల్ల
పరసతి య సంగవొందు గళిగె బట్టవనల్ల"
చరణం:--మతిహీన రొడగూడి మరుళాగిద్దినో దేవ
గతియావదొ యెనదె  గరుడగమనహరియె
2 ఐన్నపానగళిగె అగ్రగణ్య నాగి
స్నానసంధ్య జపకర్మ గలీగె నీగి
దీనరక్షక నిన్పుధ్యానవమాడదే
శ్వాసనందరె మనెమనె తిరుగు దలిద్దె
3చరణం:--ఇన్నాదరు నిన్న దాసర సంగవిత్తు
మన్పిసి సలహయ్య మదిని జానకి హరియె
అన్యరొబ్బరు కాణ ఆదరిసు వారివల్ల
పన్నగ పోయిన శ్రీ పురందర విఠల "
అను కీర్తనలో జనుల వింతపోకడలను సునిశితంగా విమర్శించాడు.అతిథులను ఆదరించని వారిని,పరసతులపొందుకొరేవారిని,మూర్ఖుల సహవాసముకోరి మతిమాలిన  వారిని విమర్శించాడు.తిండిపోతువారిని తూర్పార పట్టాడు. స్నానసంధ్యజపతపములు మానివేసి వీధికుక్కాల యింటింటికి తిరిగే వారిని హెచ్చరిస్తు హరిని ఆశ్రయించి జన్మమును ధాన్యం చేసుకోమన్నాడు.
మహాత్ములహృదయం గురించి నన్నయమహాకవి  "నిండుమనంబు నవనీతసమంబు
పల్కుధారుణా ఖండాలు శాస్త్ర తుల్యము" అన్నట్లు పురందరదాసు పలుకులు ములుకుల్లావున్నా అతని మనసు నవనీతము కన్నా సున్నితము.అందుకే ప్రజలపై ఆవేదనతో నిష్టురోక్తులాడుతున్నట్లు కనిపిస్తాయి.
తెలుగు కన్నడ భాషలు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి కావడంవల్ల ,తెలుగువారికి పురందరదాసుకీర్తనలు కొట్టీన పిండె.పైగా పురందరదాసు కీర్తనలలో తత్సమ శబ్ద ప్రయోగం భావాన్ని మరింత సరళతరం చేస్తుంది.
అందుకో ఉదాహరణ
పల్లవి:--సకలగ్రహబలనీవె సరిసిజాక్ష
నిఖిలవ్యాపకవు నీవె నీరజాక్ష!
1చరణం:-రవిచంద్ర బుధనీవె రాహుకేతువునీవె
కవిగురుశనియు మంగళవును నీవె
దినరాత్రియు నీవె,నవవిధానవునీవె
భవరోగహరవు నీవె భెక్షజవునీవె
2చరణం:-పక్షమాసవు నీవె సర్వకెలసవునీవె
నక్షత్రయోగ కరణగళవునీవె
అక్షయవెందు ద్రౌపదియమానవకాయ్ది
పక్షివాహనదీనరక్షకను నీవె
3చరణం:--ఋతుకాలవు నీవె ప్రతిదినం గాను నీవె
క్రతువు సంధ్యాధ్యాన సద్గతియు నీవె
జితవాగి యెన్నోడ పురందర విఠల
శ్రుతియుసిలుకద మహిమహివునీవె"
అన్న కీర్తన కన్నడభాష రాని వారికి ,సంస్కృత శబ్దపరిచయం వున్న వారికి సులభంగా అర్థమౌతుంది.
సకల సృష్టికి భగవంతుడే ఆధారము."భీషాత్ వాతః పవతే, భీషోదేతి సూర్యఃమృత్యోః ధావతి పంచమః"
అన్న వేదోక్తి ననుసరించి భగవంతుని ఆజ్ఞ ననుసరించి సకలసృష్టీ నడుస్తుంది.అన్నీ అతడే,అతడే అన్ని.
"కన్నడ కస్తూరి" అన్న నానుడి వుంది.కస్తూరికెంతసౌరభమో! పురందర దాసు కీర్తనల సౌరభమూ అటువంటిదే.













.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత