my favourite novelist R.K.Narayan

R.K.Narayan పెద్దగా పరిచయం అక్కరలేని ఆంగ్ల నవలారచయత.
నా అభిమాన రచయిత కూడా.Mark Twain ఎంతగా అభిమానిస్తానో  అంతకన్నా ఎక్కువ అభిమానిస్తాను.అతని కథానికలు, నవలలు జగత్ప్రసిద్దాలు. స్వామీ అండ్ ఫ్రెండ్స్ , గైడ్ ఇవి చదవని వాళ్ళు చూడని వాళ్ళు లేరంటే అతిశయోక్తికాదు.
మేము HSC తరగతులు చదివేటప్పుడు, కనీసం వీరి కథా వ్యాసమో ఎదో వుండేది. అలాంటి అభిమాన రచయతను ప్రత్యక్షంగా చూడటం అదృష్టము. పైగా వారి మైసూర్ లోని స్వంత యింటిలో చూచాను. ఇప్పటికి ఆదృశ్యాన్ని తలచుకొంటే కాస్తా గర్వంగా అనిపిస్తుంది. పాఠ్యపుస్తకాల్లోపాఠంగా దాక్కున్న వ్యక్తిని  చూడటం అబ్బో వర్ణించ లేనంత  అనుభూతి.
1986లో కొత్తగూడెం శ్రీరామకృష్ణ శారదా కుటీర్ వారి సభ్యుడుగా మైసూరులో రామకృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పిరిట్యుల్ మారాల్ సైన్స్స స్ వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళాను.
అప్పుడు జ్ఞాపకమొచ్చింది ఆవూరిలోనే  నా అభిమాన రచయిత వున్నాడని. ఒకరోజు తీరిక చేసుకొని అతని కొలవడానికి వెళ్ళాను.బుర్రలో లక్ష సందేహాలు.అతడు మనతో అసలు మాట్లాడుతాడా అనిపించింది.తీరా బయలు దేరాక వెనుదిరిగే ఆలోచనే లేదు.ఏమైతే అయ్యందనుకొన్నాను.వారి ఇల్లు గుర్తు పట్టడానికి అట్టే కష్ట పడక్కలేకుండా హోటల్ దాస్ ప్రకాష్ సమీపంలోనే వుంది.
నారాయణన్ గారి ఇల్లు సామాన్యంగానే వుంది.అప్పుడు వారు రాజ్య సభ్యులు.
వరండాలోనే కుర్చున్నాను.ఆగంతుకుడగా వచ్చిన నిన్ను ప్రశ్నార్థకంగానే చూచారు.
ఎదో రెకమెండెషన్ వ్వహారమనుకొన్నారు. నీవు ఎవరూ ఎక్కడనుండి వచ్చావనగానే ఇలా భద్రాచలం దగ్గర కొత్తగూడెం అనగానో రామకృష్ణ మఠం అనగానో కించిత్ గౌరవం కలిగిందనుకొన్నాను.  నా యింగ్లీషు భాషను వినో లేక తెలుగువాడిననో ఏమైతే నేమి మాసంభాషణ అంతా తెలుగులోనే సాగింది.సామాన్యంగా కన్నడిగులకు వారికి తెలుగువచ్చు నేను మీ అభిమానిని యనగానే ఏమేమీ నవలలు చదవావో  చెప్ప మంటే చెప్పాను.
భద్రాచలంలో రామాలయము రామదాసు ఎంత ఫేమస్సో  ఎండలూ అంతే ఫేమస్ అనుకొంటా.!వృత్తులు  వ్యావృత్తులు గురించి ప్రస్తావన వచ్చింది.ఆటోగ్రాఫ్ కోసం అప్పుడు నాచేతిలో వున్న అవధూత గీత పుస్తకం చేతికిస్తే ఆ పుస్తకం లో  ఆటోగ్రాఫ్ తీసుకొన్నా,,కాని ఆ పుస్తాకాన్ని చెదలు తినడం కొసమెరుపు.
ఇక బయలు దేరెటప్పుడు" నన్ను కూడా "మాల్గుడి "నవలల్లో  ఒక పాత్రగా చేస్తారేమోనని అనుమానంగా వుందని అనగానె  వారు చిరునవ్వుతూ సాగనంపారు.అంతటి విశిష్ట వ్యక్తి నిరాడంబరత ఎవరినైనా ఆకట్టుకొంటుంది.
ఇలా నా అనుభూతిని మీతో పంచుకోవాలని అనిపించి ఈ సోదంతా చదివించా!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత