doctor's day సీసపద్యము

My greetings and best  wishes to the entire Doctors comunity on the doctor's day
ధరణిపై తిరుగాడు ధన్వంత రులుమీరు
మనుగడ నివ్వంగ మాకు నవని
అవతరించిన యట్టి నచ్యుతురూపులు
ఆర్తజనులకెల్ల నాప్తులయ్య
ఆత్మబలమునొసగినాప్యాయ మందించు
వైద్యలెపుడుమాకు వెన్ను దన్ను
ఇలనువెల్పులెపుడు  విష్ణుస్వరూపులైన
వైద్యలన్ననిజము వెల్లడాయె
ఆ‌వె.వైద్యు డుండ నూర నుండవలయు
జనులు యనిన మాట సత్యమోయి
ఇలను వారు మనకు యిలవేల్పు సములోయి
నాగరాజ మాట నమ్ముడింక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత