మానవ జన్మ మర్మము
జనియించినామేమొ జన్మజన్మలనుంచి
కర్మాను బంధాల కారణాన
అపవర్గ మున్నట్లు నసలుకే మరుపోచ్చి
మమతాను బంధాల మరగినాము
కార్పణ్య దోషాల కారణాలేమైన
సహజమౌ స్థితినుంచి జారినాము
ఇహలోక సౌఖ్యాల యెండమావులవెంట
దాహార్తితోనింక దారి మారె
ధరలోన బ్రతుకంత ధర్మసత్రమనుమాట
మరచినా నామయ్య మాయ చేత
తాడు నే పామంచు తత్తర పాటుతో
నిలువెల్ల వణకుచు నీల్గినాము
చూడగా చూడగా శుక్తినే రజతింగ
భ్రాంతితో మనమంత బ్రతికి నాము
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి