కర్మఫలము
బింబమ్ము తోప్రతి బింబమున్నట్లుగా
నీవుయిచ్చినదేదొ నీకు వచ్చు
బీజమనుసరించి భూజముండునెపుడు
నీవంపినదియేదొ నిన్ను చేరు
అన్యులగుణమునీయందుకనిపించ
వింతేమి లేదోయి వెదికి చూడు
న్యాయనిర్ణయమంతనాదన్న పెడబుధ్ధి
మానుకొనినవాడె మాన్యుడోయి
మమతాను రాగాలుమహిలోన వ్యాపించ
మనయెద్ద కవియెచ్చు మరువ కండి
ఆ.వె.దీపకాంతితోడ దీపించు గృహమట్లు
నరుని బ్రతుకు వెలుగు జ్ఞాన మున్న
మంచి మనసు తోడ మదిగెలువ వచ్చు
నాగరాజు పలుకు నమ్ము వలయు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి