నందీశుపైనెక్కి
నందీశు పైనెక్కి నటరాజుతానంత
కమనీయమౌరీతి కదిలి రాగ
అప్సర భామలు నానంద మొందగా
నర్తనంబాడిరి నవ్యరీతి
చండీశ్వరుండంత ఛత్రంబు పట్టగా
ప్రమథగణములంత పాడియాడ
పార్వతీ మాతయె
భక్తాళి బ్రోవగ
పతితోడ తానంత పయన మాయె
వింజామరపుసేవ విఘ్శేశుడందింప
షణ్ముఖుడందించు చామరమ్ము
దేవతానికరము దీవ్యమీరితిగా
ఆడిపాడిరయ్య నమిత భక్తి
వేదవేద్య మ్రోల వేదోక్త విధితోన
మ్రొక్కులిడము మేము మోద మలర
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి