ఆదిశంకరులు
ఆదిశంకరుడంతయవనికేతేంచగా
అద్వైత తత్త్వంబు నందినాము
తర్కంపు మార్గాన తనవాద మంతయు
వేదోక్త మార్గాన వెల్ల డించె
అద్వైత మార్గాననమృతత్త్వమంతయు
లభియించు ననితాను నభిల షించె
షణ్మతములనెల్ల స్థాపించి ధరపైన
పంచాయతన పూజ భాగ్యమొసగె
భక్తి భావన మంత ప్రజలకందునట్లు
శ్లోకరచనచేసి శుభము గూర్చె
ఆ.వే.అపర శంక రుండవనికేతెంచ
దుష్ట మతములెల్ల ధూళి కలసె
మేరు నగము వోలె మేదిని కంతకు
తత్త్వ శాస్త్ర మొసగు తపసి యితడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి