పితృదేవులు

శ్రివత్స గోత్రాభ్ధి శీతాంశు కిరణండు
గొల్లపిన్నకుదురు  గొప్ప మనసు
తండ్రివలనకాదె తనయుండ పెద్దయై
వృధ్ధిచెందితినయ్య ధృడము గాను
వాసుదేవాఖ్యతో వర్ధిల్లి నాడంత
వేదాది శాస్త్రాలు వేడ్కతో నేర్వగా
వలెలాంబ కరుణతో వరపుత్ర విఖ్యాతి
సాహితీ రంగాన సముదిత కీర్తిని
ఆర్జించియందించె నాస్తిగాను
విద్యానిధియనెడి విఖ్యాతి నందిన
భారతీ పుత్రండు   ప్రదిత యశుడు
ఆ.వే.పూర్వ పుణ్య లభ్ది పుత్రండ నైతిని
అతని పేరు నిల్ప నదియె ఘనత
చెట్టు పేరు పల్కచెల్లునే కాయలు
వ్యక్తి గతమె తెల్పు వాస్త వమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత