అలవాటు పొరబాటు
బలవంతు డైనను బలహీన పడునోయి
అలవాట్ల చేచిక్కి యలసుడగును
బంధింప బడితంచు భ్రమలలో మునిగాక
బాంధవ్య మట్లుగా బంధమొప్పు
తానెంత వాడైన తగులాట మధికమై
తన్మయావస్థచే తనివిచెందు
సంస్కారవశముచే సన్యాసి యైనను
సంసార జలధిలో సంగ మించు
ఆ.వే.కనుల ముందు జరుగు కనికట్టు యాటనే
వాస్త వమ్ముయనుచు వదురునతడు
మాయదారి యాట మటుమాయ మైనంత
భ్రమల లోన తాన బయట పడును
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి