మానస సరసి

మానస సరసిలో మదమరాళమటుల
ఉడువీధి చంద్రుండు నుదితుడాయె
సురభీకోటిలోన సౌరభేయమటుల
గగనాన చంద్రుండు కలయదిరిగె
పాపాలు నశియింప తాపాలు శమియింప
పర్వత మధ్యన పంచాస్య మట్లుగా
వెన్నెల వెదజల్లె వెలుగురేడు
రజిత పంజరాన రాజిల్లు హంసంబు
శిలలపైనెక్కు సింగ మట్లు
కదనరంగమందు ఘనవీరుడట్లుగా
వెలుగు పులుగు బోలె వెన్నలొసగె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత