వనమాలి
వనమాల ధరియించి వన్నెచిన్నెలుచూపి
వరములొసగునట్టి వరుడుదతడు
కౌస్తుభా భరణుండు కామితమ్ములొసగ
కదలివచ్చెభువికి కరుణ మెరసి
ఆపద మొక్కలు నమితభక్తిమెరసి
మొక్కిన వారికి మోదమొసగ
చిటికెలొ నెరవేర్చి చిలిపిగా నవ్వేటి
వడ్డికాసుల వాడు వరము నిచ్చు
ఆ.వే.ఏడుకొండ లయ్య యేడుగడగనుండ
కొరత యేమి లేదు కొంచమైన
ఆర్త జనుల కెల్ల నండదండలనిచ్చు
శరణు కోరు వారి శరణ మతడు
(రచన:౼విద్వాన్ గొల్లా పిన్ని నాగరాజశాస్త్రి)
కొరత లేదు మనకు కొంచమైన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి