పద్యరచన

పద్యరఛనలోన ప్రాగల్భ్య మేలేదు
కావ్యరచన చేయు కళలు రావు
ఉన్న మాటపలికి నుత్పాత ముల్ దెచ్చి
చిక్కులో పడునట్టి చిత్తవృత్తి
ఉచితమౌ సలహాలు నుచితంబుగా నిచ్చి
నీకేమి పనియంచు నింద పడుదు 
 భావనా జగతిలో బాగుగా విహరించి
ఆనంద లహరిలో నాడు చుండు
ఆ.వే.గాన లహరి లోన కన్పట్టు దృశ్యంబు
మదిని దోచి  నన్ను మరవ నీదు
అనుభవంబు యెకటి యాధార మై నిల్చు
తెలిసినట్ల  దోచుతెలియదెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత