నిగమశిఖలలో

నిగమశిఖలలోన నిక్షిప్తమైనట్టి
విజ్ఞాన శాస్త్రంపు వేదికిదియె
ఆరణ్యకములన్నియాశ్రమభూమల
ఆభ్యసమొనరించు నడవియిదియె
కూర్మితో నిండిన గురుశిష్య బంధమ్ము
అవ్యాజ ప్రేమతో నమరెనిచట
తర్కించి తపియించి తత్త్వంబు గ్రహించి
శేముషీ ఘనులైరి శిష్యులెల్ల
ఆ.వె సాధు మృగము లెల్ల సావాసమొనరించు
పెద్ద పులులు తోడ ప్రేమ చూపు
కలత లసలు లేక కాపట్య మెరుగుకు
మునుల చెంత చేరి మురియు చుండు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత