వీరాధి వీర వోమాన సైనికులు
వీరాధి వీరులు వినువీధి విహరించ
శాత్రవులెల్లరు శలభమైరి
ఉగ్రమూకలనెల్ల నుచితమౌ రీతిగా
దివకేగ నేర్పాటు తీర్చినారు
కాలభైరవురీతి కల్పాంత తేజమ్మే
ఆయుధమౌ రీతి అనిని సల్పి
ఆతతాయిలనెల్వు నగ్నిపాలుగజేసి
వీరావతారులై వెలసినారు
సమర వీర మంత సాక్షాత్కరించగా
విజయమంద జేయువీరులార
వందనాలు మీకు వర్ధిల్ల వలెమీరు
అమ్మకడుపు చలువ అవని పైన
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి