సాప్ట్ వేర్ దొంగలు
అరచేతి వైకుంఠ మప్పుడే చూపించి
నిలువదొపిడిచేయు నిపుణమతులు
సాంకేతికంబును సాధనముగాజేసి
దోచుకుందురకట ద్రోహ మతులు
నయవంచనంబును నయగార మొప్పగా
పటికబెల్లమటుల పల్కగలరు
నమ్మతగదువారి నడతనెపుడుకూడ
మోసపోవుటెపుడు మోదమగునె
ఆ.వే.పరుల వంచనాన పబ్బమ్ము గడపగా
మాయ గాళ్ళు బాగ మాటువేసి
గొర్రె దాటు వారి గొప్పగా వంచించి
బ్రతుక నేర్చి రకట బాగు గాను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి