దుర్గమ్మ
దుర్గమ్మ తల్లియె దుష్టాత్ము దునుమాడి
కారుణ్య జలధియై కాచు మనల
సంగీత మొకవైపు సాహిత్య మొకవైపు
శారదా రూపాన సంతరించు
పాలకడలి పట్టిపద్మహస్థంబుతో
పరమార్థ మందించి భాగ్య మొసగు
పార్వతీ మాతయై పరమేశు పత్నియై
భక్తాళి భయమంత పారద్రోల
నలువ చెలియ నీకు జ్ఞానంబు నొసగగా
శ్రీని వాసుడంత సిరుల నొసగు
ఆభవు డంత తాను అంబతో నీకింక
మరుజన్మ లేని ముక్తి నొసగు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి