విశ్వేశ్వరుడు

కాశికా నగరాన గంగమ్మ వడిలోన
పయనించ గలగేటి పుణ్యమబ్బె
అవి ముక్తి క్షేత్రాన యానంద కానాన
వసియించు భాగ్యమ్ము వరము కాదె
మాతృగర్భమునందు నవమాసములరీతి
కాశిలోన యున్నట్లు కాంక్ష కలదు
అమ్మయు నాన్నయు యాదిభిక్షువుకాదె
కొరతేమి యుండును కొంచమైన
ఆ.వే.పెద్ద కన్నులమ్ము పెద్దరికమ్మనుచూప
అన్న పూర్ణ తల్లి యన్న మిడగ
వినతు లెల్ల నింక విఘ్నేశుకర్పించి
కుడుట పడగ వచ్చు కుశల రీతి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత