నిద్రతల్లి

హాయిగా నిద్రించ యదునుకలిగెనంచు
ఆనంద మందుటె యవస రమ్ము
నిదుర తల్లి వడినినిద్రించు సౌఖ్యమ్ము
ఇంద్రపదవికన్న  యెంతొ ఘనము
కొంపలంటుకపోవ కొరతేమిలేదంచు
నిర్ణయమ్మనొసగు నిద్ర నీకు
తననుతానుమరచుతన్మయతనిచ్చు
ఆదమరచునిద్ర హాయిగొల్పు
సభలోన నిద్రాయె సర్వులు నిదురోవ
సభకేమిలోటొచ్చె సభయుజరిగె
ధ్యానముద్రయనుచు తలపించు నిద్రను
తుర్యావస్తయనుచు తలపు నిచ్చు
ఆ.వె.ఎంత ధనము కల్గ యేమిలాభమొరుగు
కంటి నిండ నిద్ర కరువుకాగ
నిద్ర కొన్ని యేమినిధులుగలవనుచు
నిద్ర మహిమ యెరగు నిద్ర యోగి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత