నందివాహనుండు

ఏడుగడను తాను యెల్లజీవులకంచు
ఎద్దునెక్కి నాడు యిందు ధరుడు
మాకు ఱేడు కాన మాఱేడు కోరును
హర్ష మొందు తాను అభిషేక మన్నను
శంభు నాము డతడు శుభము లిచ్చు
శ్రీకంఠుడితడోయి శ్రేయస్సు కలిగించు
లోకరక్షకొరకు లోకేశ్వరుండంత
గరళమ్ము దాచెను కంఠమందు
మూడుకన్నులతోడ ముల్లోకములనేలు
ముగ్ధభక్తికతడు మురియు చుండు
ఆ.వె.అష్ట మూర్తి యితడు నషుతోషురూపాన
సర్వ శుభము లొసగు శంకరుడు
దయను జ్ఞాన మొసగు దక్షిణా మూర్తికి
దండమిడుదు నేను దయను కోరి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)





 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత