కాశ్మీర చర్చ

చర్చించి చర్చించి చవటలైరి జనులు
ఏమిలాభమొదవె యేమిమిగిలె
మతపుపిచ్చ ముదిరి మాత్సర్యమూర్తులై
పొరుగుదేశపువారు పొగరు బట్టి
ఉగ్రవాదంబునూతగా గైకొని
రక్తపాతమునంత రంగరించి క్రూరులై
కాశ్మీర రాష్ట్రాన్ని కల్లోల పరచిరి
భస్మాసురునిబోలె భస్మమైరి
ఆ.వే.చితికి పోయిరకట చితికిచిటిలినట్లు
మేకపోతు రీతి మేలమాడ
ఏమిమిగులనోయి యేడ్పయెకటిదక్కు
బుధ్ధి తెచ్చు కొనుడు భువిని మీరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత