చంద్రో దయము
అవనిజనులకెల్ల యానందమందివ్వ
విదుబింబ ముదయించి విందు చేసె
మేఘపటలినుంచి మెలమెల్లగా జారి
కువలాయనందమ్ము కూర్మినొసగె
రాజునేనచుతనరాజ్యమిదియనుచు
రాజ్యంబు చేయను రాత్రి కాగా
సంద్రంబు చూడగా సానంద మందును
తండ్రినికాంచిన తనయుడట్లు
పెరిగినానేనంచు పెట్రేగి పోడోయి
తరిగినానేనంచు తలచడసలు
చిన్నారి పిల్లల చిన్నారి మామయ్య
అల్లరిపిల్లల యాప్తు డతడు
ఆ.వె.కవుల కలల లోన కనువిందు చేయుచు
అమృత కిరణ మొసగు నాప్తుడతడు
శివుని శిగను తానెశీతాంశు కిరణుడై
సుధను పంచు నట్టి సుందరుండు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి