పౌరహక్కుల పొరపొచ్చు మాటలు
పౌరహక్కులనుచు పొరపొచ్చుమాటల
కుట్రపన్నునరుల కుదురు జూడు
మతిమాలివీరంత మారణహోమాన్ని
ఎగదోపుదోయుచు నెగుర గలరు
విద్రోహ శక్తితో వీరంగ మాడుతు
మానవహక్కలని మభ్యపెట్టు
అభ్యదయ వాదుల నాగడాలెన్నని
ఏంచగలుగుటెల్ల యెందుకిపుడు
ఆ.వే.లౌకి కంబు యనుచు లోకువ మాటల
మంచివారి మదిని మంటబెట్టు
కానివారి కెపుడు కంచాల తిండిని
అయిన వారి కేమొ నాకు తిండి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి