త్యాగరాజు

నాదాను భూతిచేనానందమందిన
తాళంబు సమకూర్చు తన్మ యతను
లయలెల్ల విన్నంత లయమౌను మదియంత
పండిత వేద్యంబు పామర హృద్యంబు
మైమరపుకలుగ మాటలేల
శిశువైన నేమాయె పశువైన నేమాయె
పరవశంబౌటయె ప్రాతి పదిక
త్యాగయ్య కీర్తనే తన్మయతను గూర్చు
ముక్తి మార్గమునకు మొదటి మెట్టు
ఆ.వె.సామవేద భవము సంగీతమంతయు
సాధనమ్ము చేత సాధ్యమగును
సకల సృష్టి యంత సంగీత మయమంచు
అనుభవంబుచేత నర్థమగును
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత