అందని మ్రాని పండు
అందరినానంద మందించుటెపుడైన
అందని మాన్రిదౌ నామ్ర ఫలము
మార్పుపేరుపలుక మానని భయము
మార్చుకొనుమునీవు మాటలేల
అతిగచింతపడుట నారోగ్య నష్టంబు
మార్చుకొనము బుధ్ధి మాటలేల
పరులకొరకునీదు పథముమార్చుకొనకు
ఆత్మవంచనమన్న నాత్మహత్యె
తానుతక్కువనెడి తలతిక్క భావమ్ము
మార్చుకొనుమునీవు మరువకెపుడు
లక్ష్యమసలునాకు లవలేశ మైనను
లేదులేదనుమాట వదుర బోకు
ఆవే. హితము చెప్పు నన్ను సుత్తికొట్టెననచు
దురుసుపలుకు పలుక దూష్యమగును
మంచి యెపుడు కూడ మధురమ్ము కాదోయి
తీపి మాటలన్ని తీరు వేరె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి